7, మే 2025, బుధవారం

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

తిరుపతి రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ చైర్మన్ గా కమిటీ ఏర్పాటు 

నేడు టిడిపి నాయకురాలు దుర్గ మృతిపై కమిటీ విచారణ


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యం కారణంగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు దుర్గ మృతి చెందిన విషయమై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. నలుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి తిరుపతి రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి రవి ప్రభు చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఆర్తో విభాగాధిపతి డాక్టర్ ఏ మధుసూధన, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగమాధిపతి డాక్టర్ టి పద్మ, న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ పి నాగరాజా సభ్యుడిగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ గురువారం సమావేశమై విచారణను జరపనుంది. ఇందుకు తగిన ఆధారాలతో తమ ముందుకు హాజరు కావలసిందిగా మృతురాలు తండ్రి షణ్ముగం, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జ్  డాక్టర్ నరేష్ కుమార్ రెడ్డి లను కమిటీ కోరింది. 

తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నాయకురాలు దుర్గ గత నెల 21వ తారీఖున ద్విచక్ర వాహనం మీద వెళుతూ ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. చికిత్స నిమిత్తం చిత్తూరు  ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్లు అవసరమైన కానీ స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించకుండా చికిత్స చేసి ఇంటికి పంపారని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. దీంతో 22వ తేదీ రాత్రి దుర్గ అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. అప్పటికే ఆమె మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. తలకు తీవ్రమైన గాయం కారణంగా ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు దృవికరించారు. ఈ విషయమై బీసీ నాయకులు షణ్ముగం ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల కారణంగానే తమ తన కుమార్తె మృతి చెందిందని జిల్లా అధికారులకు, ప్రభుత్వానికి  ఫిర్యాదు చేశారు. అపోలో ఆసుపత్రి పై కుదుర్చుకున్న ఒప్పందాన్ని పరిశీలించాలని చిత్తూరు పట్టణంలో లక్ష మందితో సంతకాలను సేకరించి జిల్లా కలెక్టర్ అందజేశారు. దుర్గ మృతి పైన తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా సీరియస్ గా స్పందించారు. మంత్రులు కొల్లు రవీంద్ర, జిల్లా ఇన్చార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కూడా దుర్గ కుటుంబాన్ని పరామర్శించి, ఆమెకు నివాళులర్పించారు. మంగళవారం జరిగిన  జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఈ విషయంలో కూడా ఈ విషయమై  చర్చ జరిగింది. అపోలో వైద్యులు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయడం లేదని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నాయుడు ఆరోపించారు. అవసరమైన పరికరాలను సమకూర్చలేదని, మొక్కుబడిగా చికిత్స చేస్తున్నారని విమర్శించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన చికిత్స అందించకుండా ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయకర్తను ఒక నివేదిక అందజేయవలసిందిగా సమావేశం కోరింది. ప్రభుత్వాసుపత్రి పైన విమర్శలు వెల్లువెత్తడంతో జిల్లా కలెక్టర్ ఏప్రిల్ 30వ తారీఖున దుర్గా మృతి పైన విచారణ ఆదేశాలు జారీ చేశారు. గురువారం తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈ విషయమై విచారణ జరగనుంది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి తరఫున డాక్టర్  నరేష్ కుమార్ రెడ్డి ఆస్పత్రి రికార్డులతో హాజరుకానున్నారు. మృతురాలి తరఫున తండ్రి షణ్ముగం వారి వద్ద ఉన్న ఆధారాలతో విచారణ కమిటీ ముందు హాజరుకానున్నారు. కమిటీ నివేదిక ప్రకారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి  వైద్యుల మీద తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పో రై గంగ 4 మృతురాలు దుర్గ 
గంగ 5 చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *