5, మార్చి 2023, ఆదివారం

కాణిపాకంలో ఉదయఅస్తమయా సేవ ఆర్జిత సేవ ప్రారంభం

ఉదయఅస్తమయా సేవ ఆర్జిత సేవను ప్రారంభించిన  

శ్రీశ్రీశ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి

           కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఉదయఅస్తమయా సేవ ఆర్జిత సేవ శ్రీశ్రీశ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి ప్రారంభించారు. కాణిపాకం  ఆలయంలో   అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనములో ఆదివారం   విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి, శ్రీశ్రీశ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు.  వారి ఆధ్వర్యంలో ఉదయం 4:00 గంటలకు ఉదయఅస్తమయా సేవ ఆర్జిత సేవ శ్రీశ్రీశ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.  ఈ ఉదయఅస్తమయా సేవ ఇద్దరు భక్తులు జీవరత్నం రెడ్డి, పాలకూర వాస్తవ్యులు,  రామచంద్ర రెడ్డి తిరుపతి వాస్తవ్యులు, మొదటిగా టికెట్లు కొనుగోలు చేసి ఈరోజు సేవలో పాల్గొన్నారు,  లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనము శిలాఫలకాన్ని పెద్ద స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. యాగశాల నందు జరుగు మహా పూర్ణాహుతిలో పాల్గొని మోదక హవనం, స్వామి విశిష్టత గురించి తెలియజేశారు.  

        స్వాములవార్లకి దేవస్థానం తరపున స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని దేవస్థానం చైర్మన్  మోహన్ రెడ్డి, ఈ.వో వెంకటేశు, అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఎమ్మెస్ బాబు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప, తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, చిత్తూరు శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈ.ఈ వెంకట నారాయణ, సి.ఐ శ్రీనివాసులు రెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపర్డెంట్ కోదండపాణి, అర్చకులు, వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *