5, మార్చి 2023, ఆదివారం

13న షాపులు, పాఠశాలలు, గవర్నమెంట్, ప్రైవేటు సంస్థలకు సెలవు

            13న షాపులు, పాఠశాలలు, గవర్నమెంట్, ప్రైవేటు సంస్థలకు సెలవు

         ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మార్చి 13వ తేదీన షాపులు, పాఠశాలలు, గవర్నమెంట్, ప్రైవేటు సంస్థలకు సెలవును ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు సెల‌వును  ప్రకటిస్తూ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 13వ తేదీ సెలవు దినంగా ప్రకటిస్తూన్న‌ట్టు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ముఖేష్ కుమార్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోని షాపులు, పాఠశాలలు, గవర్నమెంట్, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ నెల 13 న సెలువు దినంగా ప్రకటించడంతో అందరూ అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.


          ఏపీలో 14 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. అయితే.. 9 స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో 5 స్థానాలు అధికార వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. దీంతో మరో 4 స్థానిక సంస్థల నియోజకవర్గాల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మూడు పట్టభద్రులు, రెండు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మార్చి 16వ తేదీన కౌంటింగ్‌ చేపట్టి.. అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *