జాతీయ మైనార్టీ కమిషన్ సలహాదారుల సభ్యుడిగా యం. అర్షద్ అయున్ ఖాన్
జాతీయ మైనార్టీ కమిషన్ సలహాదారుల సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున యం. అర్షద్ అయున్ ఖాన్ ను నియమిస్తూ కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి షరిక్ సయీద్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ, జాతీయ మైనార్టీ కమిషన్ అన్ని రాష్ట్రాలకు సలహాదారులను ఎంపిక చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున చిత్తూరు జిల్లాకు చెందిన యం.అర్షద్ అయుబ్ ఖాన్ ను జాతీయ మైనార్టీ కమిషన్ సలహాదారులుగా ఎంపిక చేశారు. యం.అర్షద్ అయుబ్ ఖాన్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులకు పిఆర్ఓ గా, పలు మీడియా సంస్థల్లో స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహించారు.
అర్షద్ అయుబ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ తనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున జాతీయ మైనార్టీ కమిషన్ సలహాదారులుగా ఎంపిక చేసిన ప్రధానమంత్రికి, భారతదేశ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు స్మృతి ఇరానీకి, జాతీయ మైనార్టీ కమిషన్ గౌరవ చైర్మన్ ఈక్వల్ సింగ్ లాల్ పురాకి, జాతీయ మైనారిటీస్ కమిషన్ గౌరవ సభ్యురాలు సయ్యద్ షహజాదికి కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీల అభ్యుదయం కోసం ఎల్లవేళల కృషి చేస్తానని, తనకు ఇచ్చిన కర్తవ్యాన్ని పూర్తిస్థాయిలో నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.