5, మార్చి 2023, ఆదివారం

కాణిపాకంలో లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనము

  కాణిపాకంలో లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనము 

పాల్గొన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి  దేవస్థానం పాలకమండలి చైర్మన్ 

     కాణిపాక పరిస్థితి వినాయక  దేవస్థానంలో విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి,  ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనము మహా యాగంలో,  పూర్ణహారతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా  పాల్గొన్న చిత్తూరు ఎంపి రెడ్డప్ప రెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి పూతలపట్టు  శాసనసభ్యులు ఎమ్మెస్ బాబు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు. 

     అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనంలో పాల్గొన్నారు.  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు వీరికి శ్రీ కాణిపాక దేవస్థానం  చైర్మన్ మోహన్ రెడ్డి, దేవస్థానం ఈవో వెంకటేష్  స్వాగతం పలికే స్వామి వారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.  అనంతరం శేషవస్త్రంతో సత్కరించి, వేదపండితులచే ఆశీర్వదించి, స్వామి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాక దేవస్థానం అధికారులు అర్చకులు మరియు పట్టణ ప్రముఖులు పసల కుమారస్వామి, కండ్రిభాస్కర్, కంట ఉదయ్, కృష్ణ, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *