ఉద్యోగ, ఉపాధ్యాయల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి: CPI, CPM
ఉద్యోగ, ఉపాధ్యాయల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
ఉద్యోగ ,ఉపాధ్యాయుల పోరాటానికి మద్దతు గా సిపిఐ, సిపిఎం పార్టీలు ధర్నా
ఉద్యోగ, ఉపాధ్యాయులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులను మానుకోవాలని, ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా చిత్తూరు జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ (సిపిఎం) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శులు ఎస్. నాగరాజు, వాడ గంగరాజు లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయులపై కక్ష పెంచుకొని వారిని వేధించడం జగన్మోహన్ రెడ్డికి తగదని విమర్శించారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లపై చేస్తున్న పోరాటాలకు సిపిఐ, సిపిఎం పార్టీల రాష్ట్ర సమితి పిలుపు మేరకు 26 జిల్లాల్లో నిరసన, ధర్నాలు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలోని అన్ని ప్రభుత్వాలకు చేదోడుగా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రభుత్వ విధానాలను కిందిస్తాయి ప్రజలకు తీసుకెళుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులు వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నిలదీసినందుకు వారిపై కక్షగట్టుకుని వారిని వేదించడం గురిచేయడం దుర్మార్గమన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు తమ పాదయాత్రలో అధికారంలోకి వస్తే సిఎఫ్ఎస్ విధానాన్ని ఒక వారం లోపు రద్దు చేస్తామని ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే తన మాట మార్చడం శోచనీయమన్నారు.
ఉద్యోగుల ఉపాధ్యాయులు సమస్యలను పరిష్కరించాలని ఆందోళనకు సిద్ధమైతే వారిని అన్ని రకాలుగా మానసికంగా వేధించడం, భయభ్రాంతులు చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. సిపిఎస్ ను రద్దు చేయాలని, పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని, ప్రతి నెల జీతాలు ఒకటో తారీఖున చెల్లించాలని ప్రభుత్వానికి సేవ చేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ ప్రతినెల సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి పోరాటాలకు సిపిఐ సిపిఎం పార్టీలు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ప్రత్యక్ష పోరాటంలో కూడా భాగస్వామ్యం కావలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పి. చైతన్య, కాంజీవరం సురేంద్ర , సిపిఐ నాయకులు సిపిఐ నాయకులు దాసరి చంద్ర, విజయ గౌరీ, జమీలబి, కోమల, రఘు, నాగరాజా, మణెమ్మ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.