YCPకి దూరం అవుతున్న విజయసాయిరెడ్డి
వరుసగా పార్టీ పదవుల నుండి ఉద్యాసన
పార్టీ మారుతారని జోరుగా ప్రచారం
ఒకప్పుడు విజయసాయిరెడ్డి అంటే విశాఖకు మకుటం లేని మహారాజు. విశాఖ అంటే విజయసాయిరెడ్డి, విజయసాయిరెడ్డి అంటే విశాఖ. మొత్తం పరిపాలన, దందాలు అయన కనుసన్నల్లో జరిగేవి. అయన పుట్టిన రోజును విశాఖ ఎంతో ఘనంగా జరుపుకుంది. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో MP రామకృష్ణం రాజుకు షోకాజు నోటీసు కూడా జారీచేశారు. క్రమంగా పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు విజయసాయి ఢిల్లీకి మాత్రమే పరిమితం అవుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులతో ఎక్కువగా కనిపించారు. తొలుత ఉత్తరాంధ్ర భాద్యతను నుండి తప్పించి, విశాఖ భాద్యతలనుండి కూడా తప్పించారు. మళ్ళి అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తప్పించి తిరుపతి MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు. ఆ తరువాత పార్టీ సోషల్ మీడియా నుండి కూడా తప్పించారు. ఆ పోస్టును సజ్జన కొడుకికి కట్టబెట్టారు. ఇటీవల ముఖ్యమంత్రి విశాఖ వచ్చినపుడు విజయసాయిరెడ్డి జాడ సైతం కనిపించలేదు. ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సుకు విజయసాయిరెడ్డికి ఆహ్వానం కూడా అందలేదని తెలిసింది. ఒక ముక్కలో చెప్పాలి అంటే విజయసాయిరెడ్డి వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారని తెలుస్తుంది. అయన పార్టీ మారడం పక్కా అని పలువులు భావిస్తున్నారు. అయన BJP, TDP లలో ఏదో ఒక పార్టీలో చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గత కొన్నిరోజులుగా వైసీపీలో విజయసాయిరెడ్డి వ్యవహర శైలిలో కూడా మార్పు వచ్చింది. మునపటిలా ఆయన పార్టీ పట్ల, అధినేత పట్ల విధేయత చూపడం లేదు. సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై వాడీవేడి తగ్గించేశారు. లిక్కర్ స్కాంలో తన సమీప బంధువుల అరెస్ట్ తరువాత ఆయన వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. పార్టీలోనూ ఆయనకు ప్రాధాన్యత తగ్గుతోంది. ఉన్న ఒక్కో అధికారాన్ని దూరం చేస్తూ వస్తున్నారు. అటు తాడేపల్లి ప్యాలెస్ వైపు కూడా విజయసాయిరెడ్డి చూడడం లేదన్న టాక్ నడుస్తోంది. అటు సమీప బంధువు తారకరత్న మృతిచెందిన తరువాత చంద్రబాబు, బాలక్రిష్ణలతో కలివిడిగా ఉండడం కూడా ఆయనలో మార్పునకు స్పష్టమైన సంకేతం కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో వైసీపీశ్రేణులు అనుమానాపు చూపులు చూస్తున్నాయి. పార్టీతో వచ్చిన టెక్నికల్ గ్యాప్ పూడ్చుకపోగా.. ఇప్పుడు కొత్త ట్విట్, ట్విస్ట్ లతో విజయసాయి రక్తి కట్టిస్తున్నారు. పార్టీకి దూరమైనట్టేనని సంకేతాలిస్తున్నారా? లేకుంటే హెచ్చిరికలు పంపుతున్నారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
అధికార పార్టీ అయిన YSRCP లో నెంబర్ 2 పొజిషన్ ఇక Vijayasai Reddy కి లేనట్టే అనిపిస్తోంది. ఇప్పటికే ఆ వైపుగా అధినేత జగన్ మోహన్ రెడ్డి అడుగులు కూడా పడ్డాయి. వ్యూహాత్మకంగా అంచెలంచెల విధానంలో విజయసాయిరెడ్డిని పార్టీలో కీలక బాధ్యతల నుంచీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరం చేశారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర బాధ్యతలు.. విశాఖ పై నాయకత్వాన్ని కూడా ఆయన మెల్లిగా పక్కన పెట్టేశారు. దీంతో ఇప్పుడు విజయసాయిరెడ్డి ఒక్క ఢిల్లీకి తప్ప.. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో తన పట్టు కొనసాగించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ మధ్య విజయసాయిరెడ్డిని సీఎం జగన్ రాజకీయంగా దూరంగా పెడుతున్నట్టు వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా విశాఖపట్నంలో ఆయన హవా తగ్గించాలని.. విశాఖ నాయకత్వానికి ఆయన్ని దూరం చేయాలని అంతర్గతంగా పెద్ద మంత్రాంగమే నడిచిందంటారు. విశాఖ కేంద్రంగా పార్టీ వ్యవహారాలకు మించి ఆయన పెత్తనం చేస్తున్నారని పార్టీ అధినేతకు పదే పదే ఫిర్యాదులు అందాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. దాదాపు ఏడాదిన్నర నుంచీ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగడంతో హైకమాండ్ నిర్ణయం కూడా తీసుకుందని సమాచారం.
అయితే ఇదంతా విజయసాయిరెడ్డి స్వయంకృతమే అంటున్నవారు కూడా లేకపోలేదు. సాధారణంగా వైసీపీలో సర్వం జగన్నామ స్మరణే ఉండాలి. అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరగాలని కూడా చెబుతుంటారు. కానీ.. ఢిల్లీలో చక్రం తిప్పుతున్నట్టు కనిపిస్తూనే.. ఆయన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకుంటున్నారని విజయసాయిపై వై.ఎస్. జగన్ కి ఉప్పందిందట. ఇదే ఆయన కొంపముంచుతోందని విజయసాయిరెడ్డి కూడా గ్రహించలేకపోయారట. సాయిరెడ్డి తనంతట తాను వ్యక్తిగతంగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్నారని.. అందుకే ఆయన్ని సీఎం పక్కన పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు.
ఇటీవల నందమూరి నారా కుటుంబాలతో విజయసాయిరెడ్డి కలసి మెలసి ఉండడం మరోసారి సోషల్ మీడియాను ఆకట్టుకుంది. చంద్రబాబు తారకరత్న చిత్రపటానికి నివాళులు అర్పించి వెను తిరగగానే అక్కడే బాలయ్యతో పాటు ఉన్న విజయసాయిరెడ్డి ఆయనకు నమస్కారం చేశారు. ప్రతిగా బాబు కూడా పలుకరించారు. ఆ తరువాత బాబు చెవిలో విజయసాయిరెడ్డి ఏదో చెప్పారు. ఇద్దరు మాట్లాడుకున్నారు. స్టేజి దిగి కూర్చోవడానికి చంద్రబాబు విజయసాయిరెడ్డి ఇద్దరూ కలసి వెళ్లడం అక్కడ ఉన్న అందరినీ ఆకట్టుకుంది. అంతే కాదు ఇది వైరల్ అవుతోంది. ఇక బాలయ్య విజయసాయిరెడ్డి దగ్గరుండి మరీ తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమాలను నిర్వహించారు. బాలయ్య విజయసాయిరెడ్డి కలివిడిగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. విజయసాయి వైసీపీలో మళ్ళి ఒక వెలుగు వెలుగుతారా ? లేదా పక్కకు తప్పుకుంటారా? వేరే పార్టీలో చేరుతారా? అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.