2, మార్చి 2023, గురువారం

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా చెల్లేశ్వరస్వామి ఆలయం: చైర్మన్ శ్రీనివాసులు


ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా చెల్లేశ్వరస్వామి ఆలయం: 

 పాలక మండలి చైర్మన్  అంజూరు తారక శ్రీనివాసులు

       శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధం ఆలయం చెల్లేశ్వర స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా  అభివృద్ధి చేస్తామని  శ్రీకాళహస్తీశ్వర స్వామి  పాలక మండలి చైర్మన్  అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. 

     శ్రీకాళహస్తి పట్టణం పానగలలోని శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధం ఆలయం అయిన శ్రీ చెల్లేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను గురువారం  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి పాలక మండలి చైర్మన్  అంజూరు తారక శ్రీనివాసులు  పరిశీలన చేశారు. పురాణ చారిత్రిక ప్రసిద్ధమైన ఈ ఆలయం మరుగున పడి ఉండడంతో దీన్ని గుర్తించిన  శ్రీకాళహస్తీశ్వర స్వామి  పాలక మండలి చైర్మన్  అంజూరు తారక శ్రీనివాసులు  ప్రత్యేక చొరవ చూపి ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారంతో శ్రీకారం చుట్టారు. సుమారు 12 లక్షలు రూపాయలు వెచ్చించి, ఆలయ ప్రహరీ నిర్మాణం, ఆలయంలో అంతర్గతంగా గ్రానైట్ రాళ్ల నిర్మాణం పనులు చేపట్టారు. 

      అదేవిధంగా తిరుపతి శ్రీకాళహస్తి రోడ్ లో నుంచి ఆలయం లోపలికి వచ్చే రోడ్డు సిమెంట్ రోడ్డు గా అభివృద్ధి చేయడం పనులను చేపట్టారు. ఈ పనులన్నింటినీ పూర్తిచేసి మహాకుంభాభిషేకం నిర్వహించే దిశగా చైర్మన్ చర్యలు చేపట్టారు.  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి పాలక మండలి చైర్మన్  అంజూరు తారక శ్రీనివాసులు  మాట్లాడుతూ పురాణ ప్రసిద్ధమైన శ్రీ చెల్లేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసి,  శ్రీకాళహస్తికి వచ్చే యాత్రికులు అందరూ సందర్శించే విధంగా చేస్తున్నట్లు తెలిపారు.. నాడు చెంచులు పూజించిన ఆలయమైన ఈ ఆలయంలో చంద్రుడు, కాలభైరవుడు విగ్రహాలతో పాటు అద్వైత సిద్ధాంతకర్త శ్రీ పూజ్యులు ఆదిశంకరాచార్యుల విగ్రహం కూడా ఉన్నాయని, వీటినన్నిటిని దర్శించే విధంగా చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ఆలయానికి మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏఈఓ శోభరాణి కాంట్రాక్టర్ తేజు తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *