14, మార్చి 2024, గురువారం

ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన టిడిపి

 



ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గురువారం తెలుగుదేశం పార్టీ మరో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించింది. దీంతో జిల్లాలో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. తొలి జాబితాలో ఏడు మంది అభ్యర్థులను ప్రకటించగా, రెండవ జాబితాలో ఆరు మందిని ప్రకటించారు. రెండవ జాబితాలో నలుగురు నియోజకవర్గ ఇన్చార్జి లకు టికెట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపిలో చేరిన షాజహాన్ బాషాకు మదనపల్లి టిక్కెట్టు లభించింది. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు తిరిగి సత్యవేడు టికెట్టు లభించింది. ఈ జాబితాలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి రెండు,  కమ్మ సామాజిక వర్గానికి ఒకటి,   ముస్లిం మైనారిటికి ఒకరికి, ఇద్దరు ఎస్ సి అభ్యర్థులకు టికెట్లు లభించాయి. 6 మంది జాబితాలో ఐదు మంది అభ్యర్థులు ఇదివరకు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉండగా, పూతలపట్టు అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ మాత్రం మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు.


చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తి వెంకట మణి ప్రసాద్ నానికి మరోసారి చంద్రగిరి టికెట్టు దక్కింది. ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున చంద్రగిరి నుండి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతులో ఓటమిపాలయ్యారు. ఆనాటి నుంచి నియోజకవర్గంలో భార్య సుధా రెడ్డి, కొడుకుతో కలిసి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచార కార్యక్రమాలలో ముందున్నారు. కమ్మ సామాజిక వర్గ నేతల వత్తిడి మేరకు మరోమారు నానికి చంద్రగిరి టికెట్టు లభించినట్లయ్యింది. అయితే చంద్రగిరి టికెట్టు కోసం పలువురు ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గ ఇన్చార్జికే చంద్రబాబు మొగ్గు చూపారు.


 అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయన గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ, చేసి బియ్యపు మసూదన్ రెడ్డి చేతుల్లో ఓటమి పాలయ్యారు. వదలకుండా నియోజకవర్గంలో తాను, భార్య రుషితారెడ్డి, తల్లి బృందమ్మలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఒక దశలో కాళహస్తి టిక్కెట్టు బిజెపికి కేటాయించాలని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయినా చంద్రబాబు స్వర్గీయ మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం మరో మారు సుధీర్ రెడ్డి పట్ల మొగ్గు చూపారు.


 పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డికి మరో అవకాశం లభించింది. ఆయన గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సుమారు నాలుగు ఎన్నికల తర్వాత మళ్లీ ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో తలపడనున్నారు. రామచంద్రారెడ్డి ఇదివరకు టిటిడి బోర్డు మెంబర్ గా పని చేశారు. పులిచెర్ల మండలానికి చెందిన ఆయనకు మండలంలో గట్టిపట్టు ఉంది .ఈ సీటు కోసం పలువురు ప్రయత్నం చేసిన ఇన్చార్జిగా పనిచేస్తున్న చల్లా బాబు పట్ల చంద్రబాబు ముగ్గు చూపారు.


మదనపల్లి టిక్కెట్లను ముస్లిం మైనారిటీలకు చెందిన షాజహాన్ భాషకు కేటాయించారు. ఆయన జిల్లాలో జరిగిన యువగళం పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. జిల్లాలో ఒక స్థానాన్ని ముస్లిం మైనార్టీలకు కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది. మదనపల్లి వైసీపీ అభ్యర్థిగా ముస్లిం ను ఆ పార్టీ ప్రకటించింది. దీంతో తెలుగుదేశం పార్టీ కూడా ముస్లిం అభ్యర్థి షాజహాన్ బాషా పట్ల మొగ్గు చూపారు. తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో మైనారిటీలను బుజ్జగించడానికి  షాజహాన్ వైపు మొగ్గుచూపినట్లు సమాచారం.


 సత్యవేడు నియోజకవర్గానికి చెందిన కోనేటి ఆదిమూలం గత ఎన్నికలలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనను ఎమ్మెల్యేగా తప్పించి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా వైసిపి ప్రకటించింది. దీంతో మనస్థాపానికి గురైన ఆదిమూలం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు తిరిగి సత్యవేడు టికెట్టును ఖరారు చేస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. సత్యవేడు కోసం ఇదివరకు ఎమ్మెల్యేగా పనిచేసిన హేమలత కుమార్తె హెలన్, గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన జెడి రాజశేఖర్ కూడా పోటీపడ్డారు.


 పూతలపట్టు నియోజకవర్గ టిక్కెట్టు పాత్రికేయుడు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ను వరించింది. ఆయన మీడియాలో పనిచేస్తూ, రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయనను అప్పుడే నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. గతంలో చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా పూతలపట్టులో జరిగిన బహిరంగ సభలో మురళీమోహన్ ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. పలువురు అభ్యర్థులు టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేసిన చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మురళీ మోహన వైపు ముగ్గు చూపారు. ఆయన మొదటిసారి ఎన్నికల రణక్షేత్రంలో దిగనున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *