3, మార్చి 2024, ఆదివారం

టీడీపీకే చిత్తూరు టైగర్ మద్దతు !


చిత్తూరు టైగర్ గా పేరు తెచ్చుకున్న సి కె జయచంద్రా రెడ్డి (బాబు) టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్ మోహన్ నాయుడుకు మద్దతు ప్రకటించారు. ఆదివారం లోకనాదనాయుడు  కళ్యాణ మండపంలో తన వర్గానికి చెందిన వారితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు CK బాబును కలిశారు. తనకు మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అనుచరులతో చర్చించిన అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ పరిణామం చిత్తూరు రాజకీయాలలో సంచలనం సృష్టించింది. 


గత ఐదు సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న CK బాబు వచ్చే ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించడానికి నిర్ణయించుకున్నారు. ఆయన 1989లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి రికార్డు నెలకొల్పారు. తరువాత 1994 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్టి పై పోటీ చేసి జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు.1999 లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 లో ఏ పార్టీ టికెట్టు రాలేదు. దీనితో బిజెపిలో చేరారు. 2019 ఎన్నికల ముందు టిడిపిలో చేరి నప్పటికి టికెట్టు రాలేదు. ఎన్నికల అనంతర క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ సారి టికెట్టు ఆశించారు. అయితే కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల గురజాల జగన్ మోహన్ నాయుడుకు అవకాశం వచ్చింది. తొలి నుంచి సన్నిహితుడు కావడంతో సి కె బాబు నాయుడుకు మద్దతు ప్రకటించారు.


 దీనితో వైసిపి అభ్యర్థి విజయానంద రెడ్డి ఎన్నికల్లో గట్టి పోరాటం చేయవలసి వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు ఉంటాయని అంటున్నారు. తనకు మద్దతు ప్రకటించిన సి కె బాబు, ఆయన అనుచరులకు జగన్ మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా టిడిపిలో ఇన్నాళ్లు  సి కె బాబును వ్యతిరేకిస్తున్న వర్గం స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *