2, మార్చి 2023, గురువారం

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని CPM, CPI నిరసన

 పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని  సిపిఎం, సిపిఐ  నిరసన          

        భారీగా పెంచిన గ్యాస్ ధరలను  కేంద్రంలోని మోడీ ప్రభుత్వం  వెంటనే తగ్గించాలని శుక్రవారం  చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద సిపిఎం- సిపిఐ ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం చేపట్టారు.                      

       ఈ ధర్నా నుద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజన్, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ ఐదు రాష్ట్రాలు ఎన్నికలు అయిన వెంటనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా పేదలపై భారీ స్థాయిలో భారంపడే విధంగా గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐదు సార్లు గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికలకు ముందు తాళాలు ఇస్తూ ఎన్నికల అయిన వెంటనే ప్రజలపై భారం మోపడం ఆనవాయితీగా బిజెపి వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులైన ఆదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. 

      ఆయిల్, పెట్రోల్ కంపెనీలు కార్పొరేట్ శక్తులు చేతుల్లో ఉండడం వలన వాటిని వినియోగించే అన్ని రకాల వాటిపై భారీ స్థాయిలో ధరలు పెంచుతున్నారని ఇది అన్ని వర్గాల ప్రజలపై భారం పడుతుందని ప్రజలందరూ ఈ విధానాలను వ్యతిరేకించాలని పిలిపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్న రాష్ట్రప్రభుత్వం పల్లెత్తు మాట అనకుండా ఉండటం ఏమిటి అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం,సిపిఐ చేసే పోరాటాల్లో ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, సిపిఎం నాయకులు సురేంద్రన్, చైతన్య, ప్రసాద్, దాసు, సిపిఐ నాయకులు గోపి, రమాదేవి, విజయ గౌరీ, చంద్ర తదితరులు పాల్గొన్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *