బిజెపిలో చేరిన అశోక్ రాజు
రెండు రోజుల కిందట తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ కొండూరు అశోక్ రాజు మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. జయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు.
బీజేపీ సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధికి మంత్రముగ్ధులై, తెలుగు దేశం రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకులు, సీనియర్ టీడీపీ నాయకుడు, పుత్తూరు సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీల అధినేత ఆశోక్ రాజు బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి చేతుల మీదుగా బిజెపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశోక్ రాజు మాట్లాడుతూ భాజపా సిధ్ధాంతాలు, మోదీ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమం చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర నాయుడు, జిల్లా ఇన్చార్జి రాటకొండ విశ్వనాధ్, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నిషిధారాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిలకం ఈశ్వర్ ప్రసాద్, సీనియర్ నాయకులు నారాయణ స్వామి నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అట్లూరి శ్రీనివాసులు, కె.వెంకటముని, రమేష్ నాయుడు, తులసీనాధ్, జిల్లా కార్యదర్శి బాబు, నగరి అసెంబ్లీ కన్వీనర్ హరి, ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు.