RVS కాలేజి లో MLC ఎన్ని కల కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, SP, JC
ఉమ్మడి ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల,ఉపా ధ్యాయుల నియో జకవర్గ ఎంఎల్ సి ఎన్నికలు మార్చి 13న జరగ నున్న నేపథ్యంలోఇందుకు సంబంధించి ఆర్ వి ఎస్ కాలేజి లో కౌంటింగ్ ఏర్పాట్ల ను జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి యం.హరినారాయణన్, జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఆర్ వి ఎస్ కౌంటింగ్ కేంద్రం లోపట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం ఎల్ సి ఓట్ల లెక్కింపు లో భాగంగా రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ ల ఏర్పాటు, కౌంటింగ్ కు టేబుల్స్ ఏర్పాటు, కౌంటింగ్ సందర్భం గా వచ్చే వారికి కౌంటింగ్ సిబ్బంది కి భోజన ఏర్పాట్లు, బందోబస్తు,మీడియా సెంటర్ ఏర్పాటు మరియు సంబంధితఅంశాల పైకలెక్టర్, ఎస్పీలతో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్,ఎ ఎస్ పి జగదీష్, డి ఆర్ ఓ ఎన్.రాజశేఖర్ తోకలిసిపరిశీలించారు.
ఆర్ వి ఎస్ కాలేజ్ లో పట్టభద్రుల ఎం ఎల్ సి ఓట్ల లెక్కింపు,లా కాలేజి లో ఉపా ధ్యాయుల ఓట్ల లెక్కింపు నిర్వ హణ లో భాగంగా ఏర్పాటు చేయ వలసిన బ్యారి కేడింగ్, స్ట్రాంగ్ రూమ్ నుంచి ఓట్ల లెక్కింపు కు బ్యాలె ట్ బాక్స్ ల తరలిం పు,తదితర అంశా లనుపరిశీలించారు.
ఓట్ల లెక్కింపు నిర్వహణకు అవస రమైన అన్ని ఏర్పా ట్లు ఆర్ అండ్ బి అధికారులతోసమన్వయం చేసుకొని చేయాలని చిత్తూరు ఆర్డీఓ రేణుకా ను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట ఆర్ & బి ఎస్ఈ దేవా నందం, జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, పూతలపట్టు, పెనుమూరు, తహసీల్దార్ లు విజయ్ భాస్కర్ సురేష్ బాబు, సంబంధిత అధికా రులుపాల్గొన్నారు.