ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: MLA శ్రీనివాసులు
సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల సహకారంతో ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి 2019 నుంచి జరుగుతున్న మంచిని తెలపాలన్నారు. భవిష్యత్తులో చేయనున్న అభివృద్ధి, మార్పుల గురించి వివరించాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్యాంప్రసాద్ రెడ్డి ఎదురుగా ఒకటో నెంబరు సంఖ్యను వేయాలన్నారు. రెండు, మూడు ఓట్లు ఎవరికి వేయరాదన్నారు.
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 శాతం చెల్లచి ఓట్లు కింద నమోదు అయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 36 నియోజకవర్గాల్లో 3 లక్షల మంది ఓట్లు నమోదు చేసుకున్నరన్నారు. ఇక నుంచి ప్రతి డివిజన్లో గృహసారథులు సహకారంతో ఓటర్ల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేసి వారిలో చైతన్యం కల్పించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే విధంగా కృషి చేయాలన్నారు.
నియోజవర్గంలోని నాయకులు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు అందరూ సమిష్టగా కలిసి పనిచేయాలన్నారు.