9, మార్చి 2023, గురువారం

ఫోన్లలో పోటెత్తుతున్న MLC ప్రచారం


ఫోన్లలో పోటెత్తుతున్న  MLC  ప్రచారం
 
సమయం... సందర్భం లేకుండా కాల్స్ 
హోరెత్తుతున్న మెసేజులు 
 పట్టబద్రులను సతాయిస్తున్న అభ్యర్థులు



    రింగ్...రింగ్..రింగ్....హలో మీరు పట్టభద్రుల ఓటరుగా నమోదైనందుకు కృతజ్ఞతలు... మా పార్టీ తరపున అభ్యర్థిగా నిలబడి వున్నాను... మీ ఓటును వేసి గెలిపించండని అభ్యర్థులు ఎర వేస్తున్నారు... ఫోన్ల మోత మోగిస్తున్నారు... కొత్త కొత్త నెంబర్లతో  ఉదయం నిద్ర లేపుతున్నారు... సమయం... సందర్భం లేకుండా కాకపడుతున్నారు.. ఓట్లే లక్ష్యంగా... వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్ని వాడుకుంటున్నారు.. పట్టభద్రులను మభ్యపెడుతున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడే కొద్ది అభ్యర్థులు పట్టబద్రుల ఓట్ల కోసం పడరాన్ని పాట్లు పడుతున్నారు. 

           ఓటర్ల పోలింగ్ స్టేషన్, పోలింగ్ బూతు నంబరు, ఓటరు ID నంబరు, పేర్లతో అభ్యర్థులు పోటీలు పడి  మెసేజులు పంపుతున్నారు. వాట్సాప్, SMS  రూపంలో మెసేజులు వెల్లువెత్తుతున్నాయి. పోలింగు తేదీ దగ్గరపడే కొద్దీ, ఈ మెసేజులు, కాల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఫోన్ కాల్స్, మెసేజులు ఓటర్లను గుక్కతిప్పుకోనివ్వడం లేదు. వచ్చినవే మళ్ళీ  మళ్ళీ  వస్తుంటే,  చిరాకు వస్తుంది. చాల మంది ఆ  బ్లాక్ లిస్ట్ చేసారు.  కొందరు ప్రారంభం లోనే కాల్ కట్ చేస్తున్నారు.  పూర్తిగా వినడం కూడా లేదు. 

        పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో అభ్యర్థులు సామాజిక మాధ్యమాలను విసృతంగా వాడుతున్నారు. ఫోన్ల ద్వారా పట్టభద్రులను కాకా పడుతున్నారు. ఉదయం నిద్ర లేపుతున్నారు. పడుకునేదాకా కొత్త కొత్త నెంబర్లతో... నేను అధికార.. ప్రతిపక్ష పార్టీల మద్దతుతో అభ్యర్థిగా బరిలో నిలబడ్డాను. మీ ఓట్లను వేసి గెలిపించాలని కోరుతున్నారు. వారి ప్రతినిధులచే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటరుగా నమోదయినందుకు కృతజ్ఞతలు అంటూ మొదలుపెట్టి ఓటు తమకే వేయాలంటే మభ్యపెడుతున్నారు. అధికార,ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను కాకా పడుతున్నారు. పట్టభద్రులు ఫోన్ నెంబర్లు కనిపెట్టి వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా కరపత్రాలను పంపుతున్నారు. స్థానిక పార్టీల నాయకులతో పట్టబద్రులకు ఫోన్లు చేయిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నమూనా బ్యాలెట్ పత్రాలలో అభ్యర్థి క్రమ సంఖ్యలు సూచించేలా సందేశాలు ఇస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఎరవేస్తున్నారు. సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుకుంటూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. 

      అయితే పట్టభద్రుల ప్రయోజనాల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటామన్న హామీ ఎవరి నోట వెంట రాకపోవడం గమనార్హం. శాసన మండలి చరిత్రలో సార్వత్రిక ఎన్నికలను తలపించేలా పట్టభద్రుల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గమనార్హం. సామాజిక మాధ్యమాలతోj పట్టభద్రులను సతాయిస్తున్నారు. ఎలాగైనా గెలిచి మండలిలో అడుగు పెట్టాలని అభ్యర్థులు తహతహలాడిపోతున్నారు.అభ్యర్థులు, వారి ప్రతినిధుల ప్రలోభాలకు లొంగకుండా పట్టబద్రులు విచక్షణతో ఓటు హక్కను వినియోగించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *