19 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ: DRO రాజశేఖర్
పిల్లల కడుపులోని నులిపురుగుల నివారించడం ద్వారా పిల్లల యొక్క ఆరోగ్య వృద్ధి పొంపొందించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దలన్నదే ప్రభుత్వ యొక్క ముఖ్య ఉద్దేశని డి ఆర్ ఓ.యన్.రాజశేఖర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లోని డిఆర్ఓ సమావేశం హాల్ నందు జిల్లా వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమం, విద్యా, సర్వ శిక్ష అభియాన్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పరిషత్, గ్రామీణ అభివృద్ధి, జిల్లా గ్రామీణ నీటిపారుదలశాఖలదికారులతో జిల్లాలో ఈనెల 14 నుండి 18 వరకు (Natinal De- Warming Day) జాతీయ నులిపురుగుల నిర్మూలన దినమును కార్యక్రమము మీద సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ పిల్లల కడుపులోని నులిపురుగుల నివారించడం ద్వారా పిల్లల ఆరోగ్య వృద్ధి పొంపొందించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు. సంవత్సరం నుండి 19 సంవత్సరపు లోపు అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు, పాఠశాలలోను, కళాశాలలోను వివిధ రకాల వసతి గృహాలలోను, బడి బయట ఉన్న పిల్లలందరికీ ఈనెల 14వ తేదీ నుండి 18 తేదీ వరకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీకి సంబంధించి సంబందితా శాఖల అధికారులు సమన్వయ చెసుకొని విజయవంతంగా నిర్వహించాలన్నారు.
సంవత్సరం నుండి నుండి 2 సంవత్సరంలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రను, 200 ఎంజి (1/2 అర్ధ మాత్ర ను) 2 సంవత్సరాల నుండి 19 సంవత్సరంలోపు పిల్లలకు 400ఎంజి మాత్ర వేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. టిఫిన్ గానీ లేదా భోజనం తిన్న తర్వాతనే ఈ మాత్రలు వేసుకోవాలన్నారు. ఆరోగ్యం బాగు లేకున్నా వారు ( జ్వరం ఉన్న వారు ఈ మాత్రలు వేసుకోకూడ దని జ్వరం తగ్గిన తర్వాత వేసుకోవచ్చునని) నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ కి సంబంధించి పిల్లలకు, తల్లిదండ్రులకు, అంగన్వాడీ, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని అంగన్వాడి ఆశ కార్యకర్తలకు, ఉపాధ్యాయులకు ఈ మాత్రలు పంపిణీ పై అవగాహన చేయాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ల సుదర్శనం, రవి రాజు, శ్రీనివాసులు, డీఈఓ. విజయేంద్ర రావ్, సాంఘిక సంక్షేమ శాఖ డి డి.డాక్టర్ రాజ్యలక్ష్మి, ఐ సి డి ఎస్. పిడి నాగశైలజ తదితరులు పాల్గొన్నారు.