4, మార్చి 2023, శనివారం

ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు మాన్యువల్ ను చదివి అర్థం చేసుకోండి: JC

 ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు మాన్యువల్ ను చదివి  అర్థం చేసుకోండి:  

 జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్



         శాసనమండలి ఎన్నికలు ఈనెల 13న జరగనున్న నేపథ్యంలో ఈ నెల 16న నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియను సమర్ధ వంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ పర్సనల్స్ పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం జిల్లా ప్రజా పరిషత్  సమావేశ మందిరంలో ఈనెల 16 న ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయులనియోజకవర్గ శాసనమండలి ఎన్నికలఓట్లలెక్కింపు ప్రక్రియ కు సంబం ధించి తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు సంబం ధించి కౌంటింగ్ పర్స నల్స్ గా విధులు నిర్వర్తించేందుకు ఎంపిక చేసిన వారికి ఏ ఆర్ ఓ మరియు డిఆర్ఓఎన్.రాజశేఖర్ పర్యవేక్షణ లో శిక్షణ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నిష్పక్షపాతంగా కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు భారతఎన్నికలసంఘం వారి ఎన్నికల నియమావళి పై రూపొందించిన మాన్యువల్ ను  క్షుణ్ణంగా చదివి  అర్థం చేసుకొని పూర్తి అవగాహననుఏర్పరుచుకోవాలన్నారు..ఈనెల 10వ తేదీన మరోమారు ఆర్ వి ఎస్ కాలేజీ నందు శిక్షణ తరగతులను నిర్వహించడం జరు గుతుందనితెలిపారు

      


 ఏ ఆర్ ఓ, డిఆర్ఓ మాట్లాడు తూ శాసలిమండలి ఓట్ల లెక్కింపుప్రక్రియ కు విధులు కేటాయిం చిన అధికారులు కౌంటింగ్ మ్యానువల్ పై అవగాహన పెంచు కోవాల్సిన అవసరం కలదన్నారు..


       రిటైర్డ్  ఏ జే సీ మరియు మాస్టర్ ట్రైనర్ వి ఆర్ చంద్ర మౌళి మాట్లాడుతూ శాసనమండలి ఓట్ల లెక్కింపుప్రక్రియ కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటే షన్ ద్వారా అవగాహన కల్పిస్తూ పట్టభద్రులు, ఉపా ధ్యాయుల ఓట్ల లెక్కింపు కు ఏర్పా టు చేసిన ప్రతి టేబు ల్ కు సిబ్బంది ఉంటారని, కౌంటింగ్ పర్సనల్స్ కౌంటింగ్ కేంద్రంలోనిమొబైల్స్, పెన్ను ను తీసుకొని వెళ్ళడానికిఅనుమతి లేదని తెలిపారు.. ఓట్ల లెక్కింపులో భాగంగా ప్రాధమికం గా మొదట పోస్టల్ బ్యాలెట్  అనంతరం బ్యాలెట్ పేపర్లను కట్టగా కట్టి పోలింగ్ స్టేషన్ ల వారీ గా డ్రమ్స్ ఇన్చార్జికి అప్పగించిన తరు వాత పోస్టల్ బ్యాలె ట్ పేపర్లు మరియు పోలింగ్ స్టేషన్స్ వారీ గా  కట్టలు కట్టిన బ్యాలెట్ పేపర్లు ను మొత్తం కలిపి అభ్య ర్థుల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందన్నా రు.కౌంటింగ్ మాన్యు వల్ లోని ప్రతి లైన్ ను క్షుణ్ణంగా చదివి కౌంటింగ్ పర్సనల్స్ అర్థం చేసుకోవాలని తెలిపారు..

     ఈ శిక్షణ తరగతుల లో తిరుపతి డి ఆర్ ఓశ్రీనివాసరావ్, జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి,చిత్తూరు, నగరి, కుప్పం, పలమనేరు మదనపల్లె,సూళ్లూరుపేట,శ్రీకాళహస్తి గూడూరుఆర్డీఓలు రేణుకా,సుజన, శివయ్య,మురళి, చంద్ర ముని రాణార్, రామారావు, కిరణ్ కుమార్, జి ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోదండరామిరెడ్డి కౌంటింగ్ పర్సనల్స్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *