తాగునీటి సరఫరా పథకం పనులు పరిశీలించిన కమిషనర్
చిత్తూరు శాశ్వత తాగునీటి సరఫరా పథకం పనులు పరిశీలించిన కమిషనర్ డా. జె అరుణ
చిత్తూరు నగరానికి శాశ్వత తాగునీటి సరఫరా పథకానికి సంబంధించిన డబ్ల్యూటీపి ( నీటి శుద్ధీకరణ ప్లాంట్) నిర్మాణ పనులను నగర కమిషనర్ డా. జె అరుణ పరిశీలించారు. శనివారం ఉదయం కమిషనర్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి దామలచెరువు వద్దనున్న అడవిపల్లె రిజర్వాయర్, డబ్ల్యూటీపి ( నీటి శుద్ధీకరణ ప్లాంట్) నిర్మాణ పనులను పరిశీలించారు. అమృత్ పథకంలో భాగంగా చిత్తూరు నగరానికి శాశ్వత తాగునీటిని సరఫరా కోసం రూ.271 కోట్లతో జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును ఇంజనీరింగ్ అధికారులు, కేఎల్ఎస్ఆర్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అడవిపల్లె రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని డబ్ల్యూటీపీ సరఫరా చేస్తారు. ఇక్కడ నీటిని శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా చిత్తూరు నగరానికి తీసుకొస్తారు. నగరంలోని పైప్లైన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. పనులను రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎస్ఈ సి.గోపాల్ రెడ్డి, డీపీహెచ్ఈవో పుష్పగిరి నాయక్, ఏఈ విష్ణువర్ధన్ రెడ్డి, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.