8, మార్చి 2023, బుధవారం

మహిళా దినోత్సవం సందర్భంగా కాన్సర్ హెల్త్ చెకప్ క్యాంపు

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  

పోలీసు కుటుంబాలు, మహిళా ఉద్యోగులకు కాన్సర్ హెల్త్ చెకప్ క్యాంపు 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మార్చ్ 8 వ తేదిన ఘనంగా నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ  వై.రిశాంత్ రెడ్డి ఆదేశానుసారం బుధవారం జిల్లా పోలీస్ AR హెడ్ క్వార్టర్స్ లో   పోలీసు కుటుంబాలు, మహిళా ఉద్యోగులు కొరకు కాన్సర్ హెల్త్ చెకప్ క్యాంపు నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపు టాటా ట్రస్ట్ కాన్సర్ హాస్పిటల్ (SVICCAR)  సౌజన్యంతో  మహిళల కాన్సర్ వ్యాదుల నిర్ధారణ కొరకు ప్రత్యేకంగా  నిర్వహించారు. బస్సు నందు మామోగ్రఫి, అల్ట్రాసౌండ్, పాప్స్మియర్, ఓరల్ పరీక్షలు, షుగర్, లివర్, జాండిస్ పరీక్షలు మహిళలలో సంక్రమించే గర్భాశయ ముఖద్వారా కాన్సర్, ఇతర కాన్సర్ వ్యాది నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 

 


  AR  గ్రౌండ్స్ నందు నిర్వహించిన ఈ హెల్త్ చెకప్ క్యాంపు నందు పోలీసు  ఉద్యోగులు,  పోలీసు కుటుంబాలలో   35 సంవత్సరాలు పైబడిన 100 మహిళలకు ఉచిత కాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ పి.జగదీష్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పి అడ్మిన్  మాట్లాడుతూ సేవా దృక్పదంతో పోలీసు ఉద్యోగులు, పోలీసు కుటుంబాల మహిళలకు ఉచిత కాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి సమ్మతించి  బస్సును  పంపించిన టాటా ట్రస్ట్ కాన్సర్ హాస్పిటల్ ప్రోగ్రాం మేనేజర్  హేమంత్ కుమార్ కు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

         అంతర్జాతీయ మహిళా దినోత్సవమును చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ఘనంగా నిర్వహించుచున్నదని, ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ హెల్త్ చెకప్ క్యాంపు నిర్వహిస్తున్నామని చెప్పారు.  35 సంవత్సరాలు పైబడిన మహిళలకు కాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఖచ్చితంగా అవసరమని, ప్రారంభదశలోనే నిర్ధారణ అయితే చికిత్స సులువు అవుతుందని తెలిపారు.  అందువలనే జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా ఉద్యోగులు, పోలీసు కుటుంబ సభ్యులకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.  


ఈ కార్యక్రమంలో టాటా ట్రస్ట్ కాన్సర్ హాస్పిటల్ పింక్ బస్సు నందు విచ్చేసిన ప్రాజెక్ట్ మేనేజర్ హేమంత్ కుమార్, డెంటల్ డాక్టర్  భార్గవ్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ రెడ్డి కుమారి, మామో టెక్నీషియన్  చైతన్య, పోలీసు వెల్ఫేర్ డాక్టర్  లావణ్య, ఏ.ఆర్. అడిషనల్ ఎస్పి  జి.నాగేశ్వర రావు, SDPO చిత్తూరు  శ్రీనివాస మూర్తి, దిశా డిఎస్పి  బాబు ప్రసాద్, ట్రాఫిక్ డి.ఎస్పీ తిప్పేస్వామీ, డి.టి.సి. డి.ఎస్పీ  శ్రావణ్ కుమార్, SC/ST డి.ఎస్పీ  విష్ణు రఘువీర్, MTO  మధు, RI అడ్మిన్  నీలకంటేశ్వర రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్లునరసింహ రాజు,  మద్దయ్య్చారి, గంగి రెడ్డి,  శ్రీనివాస రెడ్డి, పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్  ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *