మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: మహిళా ఎస్సైలు
మహిళా ఎస్సైలు వసంతకుమారి, నాగ సౌజన్య, కార్పొరేటర్ కే.పీ.లతా పిలుపు
అంతర్జాతీయ మహిళ దినోత్సవం (Inter National Woman's Day) సందర్భంగా బుధవారం ఎస్ టి యు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య (NFIW) ఆధ్వర్యంలో బి. కుమారి అధ్యక్షతన సభ జరిగింది. సమావేశ ప్రాధాన్యతను నగర కార్యదర్శి కే.రమాదేవి మహిళా కార్యకర్తలకు వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వన్ టౌన్ ఎస్ ఐ వసంతకుమారి, దిశా పోలీస్ స్టేషన్ ఎస్ ఐ నాగ సౌజన్య, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ కె పి లత ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత లు మాట్లాడుతూ ముందుగా మార్చి8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
మహిళల కోసం ప్రభుత్వం తెస్తున్న మహిళచట్టాల పై అవగాహన పెంచుకోవాలని, ప్రతి మహిళ తన కుటుంబంలో ఆడ మగ అనే తేడా లేకుండా పిల్లలను పెంచాలన్నారు. పిల్లలను ఆడ మగ తేడా లేకుండా సమానంగా చదివించాలని అన్నారు. పిల్లల చేస్తున్నటువంటి పనులను తల్లి బాధ్యతగా గమనించాలన్నారు. గతం మాదిరి కాకుండా ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారని ఇది గొప్ప మoచి పరిణామం అన్నారు. పిల్లల ను మంచి పౌరునిగా తీర్చిదిద్దడంలోనూ తల్లి పాత్ర ప్రధానమైనది అన్నారు. మహిళలు అన్ని విషయాల్లోనూ ఓపిక ఉంటూ ఆలోచించే శక్తిని పెంచుకోవాలన్నారు. కుటుంబంలో చిన్న విషయానికి పెద్ద విషయానికి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని ఓపిక అవసరమని అన్నారు అవసరపడితే ఇబ్బందులకులోను కావలసి వస్తుందన్నారు.
మహిళా దినోత్సవ సందర్భంగా కార్పొరేటర్ కె.పి పుష్పలత ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, ప్రేమ లు కేకు కట్ చేశారు. ఈ సమావేశంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అధ్యక్షురాలు కే .ప్రేమ కే.ప్రభావతి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య చిత్తూరు నగర నాయకులు ఎస్. జయలక్ష్మి,బి. కుమారి, కే .రమాదేవి, వి .కోమల, సుగుణ, ప్రభావతి, మనీ మేఘాల, లత పాల్గొని ప్రసంగించారు.
మహిళా దినోత్సవ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు , గోపీనాథ్ , మణి లు మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కాకుండా మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై, మహిళా రిజర్వేషన్లపై కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య కార్యకర్తలు అగ్రభాగాన ఉంటూ పని చేయాలని సందేశం ఇచ్చారు.