8, మార్చి 2023, బుధవారం

దిశ పోలీసు స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు.


 చిత్తూరు దిశ పోలీసు స్టేషన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు.

          కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి… పాదాభివందనాలని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జగదీష్  అన్నారు.  చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు దిశ పోలీసు స్టేషన్ డీఎస్పీ  బాబు ప్రసాద్  ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జరిగాయి. 

      ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్  పి. జగదీష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.  దిశ పోలీసు స్టేషన్లో, చిత్తూరు పట్టణంలో పనిచేస్తున్న మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మహిళా పోలీసులచే మొదటగా కేక్ కట్ చేయించి అందరికి శుబాకాంక్షలు తెలిపారు.  వారి సేవలను గుర్తు చేస్తూ వారిని అడిషనల్ ఎస్పీ  పులగుచ్చంతో అభినందించారు.  కార్యక్రమం అనంతంరం చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న మహిళా పోలీసులకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్, పట్టణ డి.ఎస్పీ లు చీరలు, స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు.  

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *