ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ జరగాలి: ఎన్నికల పరిశీలకులు
ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిపేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికలపరిశీలకులు కోన శశిధర్ ఐఏఎస్, ఎస్.హెచ్. కాటమనేని భాస్కర్ ఐఏఎస్ సూక్ష్మ పరిశీలకులకు దిశా నిర్దేశం చేశారు.
మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం లో ప్రకాశం- -నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల,ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ నిర్వహణ లో పాల్గొనే సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం ప్రకాశం- నెల్లూరు చిత్తూరు పట్టభద్రులు,ఉపా ధ్యాయులనియోజక వర్గ ఎన్నికల పరి శీలకులు కోన శశిధర్ ఐఏఎస్,
సి.హెచ్.కాటమనేని భాస్కర్, ఐఏఎస్, జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి యం. హరి నారాయణన్ తో కలిసి పాల్గొన్నారు.
ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు ఉపాధ్యాయుల నియోజక వర్గ ఎన్నికల పరి శీలకులు కోన శశిధర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత అన్నారు. కేంద్ర ప్రభుత్వ పలు బ్యాంకు అధికారుల ను సూక్ష్మ పరిశీలకు లుగానియమించడం జరుగుతుందని, సూక్ష్మపరిశీలకులుగా నియామకం కాబడ్డవారు వారికి కేటాయించిన విధు లనుఎన్నికలనియమ నిబంధనలను అనుసరించి తూచా తప్పక పాటించాలని తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో సూక్ష్మ పరిశీలకుల విధులపై అవగాహన కల్పిం చడంజరుగుతుందని అర్థం చేసుకొని సజావుగా ఎన్నికల విధులు నిర్వర్తించాలన్నారు. ఎన్నికలవిధులకు కేటాయించిన అధికారులకు ఎటువంటి మినహాయింపులు ఉండవని తెలిపారు. సూక్ష్మ పరిశీలకుల నివేదిక లో ఎటువంటి పొర పాట్లకు తావు లేకుండా ప్రిసైడింగ్ అధికారి తో సమ న్వయం చేసుకొని నివేదికఇవ్వాలన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ సూక్ష్మ పరిశీల కులకు శిక్షణ తరగ తులలో భాగంగా తెలిపిన సూచనల ను తప్పనిసరిగా అవగాహన చేసు కోవాలనన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలలో జరిగే ప్రతి విష యా న్ని క్షుణ్ణంగాపరిశీలించాలని సూక్ష్మ పరిశీ లకు గల విధులకు సంబంధించి తెలిపిన అంశాలను పోలింగ్, కౌంటింగ్ రోజున నమోదు చేసి సీల్డ్ కవర్ లోరిసెప్షన్ సెంటర్ వద్ద నోడల్ అధికారికి నివేదిక అందించాల్సి ఉంటుందన్నారు.
జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ సూక్ష్మపరిశీలకు లు ఎన్నికల సంఘం కేటాయించిన విధులను అవగాహన చేసుకొని నిర్వర్తించాలని, దీనితోపాటు ఎన్నికలపరిశీలకులకు సూచించిన విష యాలను పాటించాలన్నారు. సూక్ష్మ పరిశీలకులు ఈ నెల 12న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ప్రి సైడింగ్ అధికారులు పోలింగ్ సామాగ్రిని తీసుకొని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం జరుగుతుందని వారితో పాటు సూక్ష్మ పరిశీలకులు వెళ్లి రాత్రి బస చేయాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ రోజైన 13న పోలింగ్ ప్రక్రియకు ఉదయం 6 గంటలకు హాజరై, 7 గంటలకు పిఓ పోలింగ్ ఏజెంట్లకు పాసులు ఇస్తారని, 7:30 గంటలకు బ్యాలెట్ బాక్సులను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీల్ వేసి పోలింగ్ నిర్వహణకు సిద్ధం చేస్తారని అన్నారు. 7:58 గంటలకు పిఓ ఎన్నికల డిక్లరేషన్ చదివి, 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగు తుందని, సా.4 గంటల వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు తమ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కలదన న్నారు.
సూక్ష్మ పరిశీలకులకు శిక్షణా తరగతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్వహించిన రిటైర్డ్ ఏ జె సి, మాస్టర్ ట్రైనర్ వి.ఆర్. చంద్రమౌళి సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ మరియు కౌంటింగ్ లో వారికి గల విధు లను వివరించి వారి సందేహాలను నివృత్తి చేశారు.
ఈ శిక్షణా తరగతులలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్.ఎస్. వెంకటేశ్వర్, మ్యాన్ పవర్ నోడల్ అధికారి మరియు జెడ్పిసిఈఓ ప్రభాకర్ రెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసివెంకటరమణా రెడ్డి, సంబంధిత అధికారులు, సూక్ష్మ పరిశీలకులు పాల్గొన్నారు..