రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మదనపల్లి పట్టణం కదిరి రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఘటనపై వివరాలు ఇలా ఉన్నాయ్. నీరుగట్టుపల్లి బాబుకాలనీకి చెందిన రెడ్డిశేఖర్ కుమారుడు జీవన్ ప్రకాష్ అలియాస్ నాని(23) పీడీఎస్ బియ్యం వాహనం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం బైకులో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇంటికి వెళ్తుండగా మసీదు కాంప్లెక్స్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మృతి చెందాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించే అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.