7, మార్చి 2023, మంగళవారం

ఆడపిల్లలకు విద్య ఎంతో అవసరం: జిల్లా కలెక్టర్



 ఆడపిల్లలకు విద్య ఎంతో అవసరం: జిల్లా కలెక్టర్

    మహిళలు అన్ని రంగాలలో రాణిస్తు న్నారని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ పేర్కొన్నారు.మంగళవారం జిల్లా సచివాలయంలో జ్యోతిరావు పూలే భవన్ డిఆర్డిఏ సమావేశ మందిరం లో  ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
   ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని తెలుపుతూ.. మనిషికి జన్మను ఇచ్చే శక్తి ఒక మహిళకే కలదని, మహిళలను గౌరవించడం మన సంస్కృతి అని తెలిపారు.మన దేశంలో గల కుటుంబ వ్యవస్థలో మహిళ ప్రముఖ పాత్రను పోషిస్తుందని, కుటుంబ అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందన్నారు. మహిళల శక్తి సామర్థ్యాలను వారి కుటుంబ అభివృద్ధికే కాకుండా సమాజ అభివృద్ధికి తోడ్పాటు అయ్యేలా కృషి చేయాలన్నారు. ఇలాంటి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు మన రాష్ట్రంలో ఏర్పాటు అయిన  స్వయం సహాయక సంఘాలు వీటి అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం గా కలదనన్నారు. 
     జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సాంప్రదాయంలో మహిళలకు ప్రత్యేక స్థానం కలదని, పురాతన కాలం నుండి స్త్రీలను గౌరవించడం జరుగుతున్నదని మహిళలు అని రంగాలలో రాణిస్తున్నారని స్వయం సహాయక సంఘాల మహిళలు మరింత అభివృద్ధి చెందాలని తెలిపారు.
     డిఆర్డిఏ పిడి తులసి మాట్లాడుతూ మహిళలకు కుటుంబ బాధ్యత తో పాటు పిల్లల సంరక్షణ మరియు  ఇతర బాధ్యతలు నిర్వర్తించడం జరుగుతున్నదని, ఇలా ప్రతి అంశంలో మహిళ కీలకంగా మారిందని, ప్రపంచం మొత్తం మహిళల  అభివృద్ధి వైపు చూస్తోందనన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల కు సంఘాలు ఏర్పడిన మొదట్లో రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకుల వారు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండేది కాదని అలాంటి పరిస్థితుల  నుండి నేడు 20 లక్షల దాక రుణాలు పొంది స్వతహాగా వ్యాపారాలు చేసే స్థాయికి మహిళలు చేరుకున్నారని, 98 శాతం రీపేమెంట్ కలదని, మహిళలు ఆర్థిక అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు..

     ఐ సి డి ఎస్ పి డి నాగ శైలజ మాట్లా డుతూ మహిళలు ఆరోగ్యవంతులుగా ఉంటూ వారి కుటుం బాన్ని మొత్తం ఆరో గ్యంగా ఉండేలా చూసుకునేందుకు మరియు  బాల్య వివాహాలను అరి కట్టేందుకు కృషి చేయాలని తెలిపారు.. 

    ఎల్ డి ఎం శేషగిరి రావ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్  లో  గల స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి దిశలో కలవని 30 సంవత్సరాల క్రితం స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల లో  ఖాతాలు తెరిచేందుకు  కూడా బ్యాంకులు నిరాకరించే పరిస్థితి ఉండేదని,ఆ పరిస్థితి నుండి నేడు ఒక సంఘానికి 20 లక్షల దాకా రుణాలు మంజూరు చేసే స్థాయికి మహిళలు చేరుకున్నారని తెలిపారు.

   అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిమబిందు మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తున్నప్పటికీ, మహిళలకు రాజ్యాంగం ద్వారా పొందిన  హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం కలదని, ప్రతి తల్లి మగపిల్లలను  నైతిక విలువల తో  పెంచాల్సిన అవసరం కలదని ప్రతి తల్లి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.
    ఈ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన  సిడిపిఓ లకు, సూపర్వైజర్లకు, అంగన్వాడి వర్కర్లకు సమాఖ్య లకు, విఓ లకు,జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మేమెంటోలను అందించారు.

    ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగంతరపున మహిళా జిల్లా అధికారులను జెడ్పీ సీఈఓ, ఎల్డీఎం సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని రాజ్యలక్ష్మి,డి.సి.ఓ (గురుకుల పాఠశాల) జయ భారతి, సిపిఓ ఉమాదేవి డి.ఐ.పి.ఆర్.ఓ పద్మజ ఎపిడిమాలజిస్ట్ శ్రీవాణి, సిడిపిఓలు, అంగన్వాడీ, కార్యకర్తలు స్వయం సహాయక సంఘ మహిళలు పాల్గొన్నారు..

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *