నకిలీ హిజ్రా పై కఠిన చర్యలు తీసుకోవాలి
మదనపల్లి పట్టణ శివారులో ఉన్న కాలనీ వద్ద హిజ్రా ల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో రాయలసీమ జిల్లాల హిజ్రా నాయక్ లు , కర్ణాటక లోని బళ్ళారి ప్రాంతాల్లోని హిజ్రా నాయక్ లు సమావేశం మై కాకినాడ కు చెందిన నకిలీ హిజ్రా పండు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాకినాడ కు చెందిన పండు ఒక దొంగ అని అతని పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రతీ జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు చేయనున్నట్లు తీర్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హిజ్రా అధ్యక్షురాలు హాసిని నాయక్, జిల్లా అధ్యక్షురాలు శ్రావణి నాయక్, సుజాత నాయక్, మదనపల్లి హిజ్రా సంఘం నాయకులు సుమ, షాకిర, లైలా సైరా, సల్మా, తదితరులు పాల్గొన్నారు.