ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మహిళలకు ఘన సన్మానం
ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మహిళలకు ఘన సన్మానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ అర్బన్ అధ్యక్షులు చల్లూరు ద్వారకనాథ్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రానిస్తున్న ఆర్యవైశ్య మహిళలకు చిరు సన్మానం చేశారు వాసవి క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వాణి రమేష్, శైలారావు, లీలా మోహన్ రాధిక సురేష్, మానస మనోహర్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చల్లూరు ద్వారకనాథ్ మాట్లాడుతూ మహిళలు చిన్నస్థాయి నుంచి ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయి వరకు ఎదిహరన్నారు. అన్ని రంగాలలో భారతదేశంను అభివృద్ధి పథంలో నిలుపుతున్నారని కొనియాడారు. అలాంటి మహిళలను మహిళా దినోత్సవం రోజు సన్మానించడం ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా మా బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ ఉపాధ్యక్షులు ఆరూరు రామమూర్తి, ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి తిరువీధి రవీంద్రబాబు, ట్రెజరర్ గుడిపాటి ప్రకాష్, బి.శ్రీనివాస్. ఓరుగంట నాగేంద్ర, చిలుముకూరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.