6, మార్చి 2023, సోమవారం

బాలికలు హక్కులు, చట్టాలపై పూర్తి అవగహన కలిగి ఉండాలి

బాలికలు హక్కులు, చట్టాలపై  పూర్తి అవగహన కలిగి ఉండాలి


      మహిళలకు, బాలికలుకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలపై  పూర్తి అవగహన కలిగి ఉండాలని  జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐ. కరుణ్ కుమార్అన్నారు. సోమవారం ఉదయం  యన్.పి.ఎస్. ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల నందు ప్రిన్సిపాల్ మనోహర్ తో కలసి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో  నిర్వహించిన మహిళలకు, బాలికలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాల పై అవగాహన కార్యక్రమమం నిర్వహించారు.

         ఈ సందర్భంగా    ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహిళలకు, బాలికలకు కల్పించిన  హక్కులు,చట్టాల  పై చదువుకొనే రోజులలోనే బాలికలు పూర్తి అవగహన కలిగి ఉండాలన్నారు,   బాల్య వివాహాల వల్ల కలిగే, సంభవించే నష్టలు పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.  తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేయుటకు మీపై ఒత్తిడి చేసిన యడల వెంటనే  పోలీస్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారుల కు తెలియజేయాలని, సంబందితా అధికారుల సహకారంతో బాల్య వివాహాలు జరగకుండా నిలుపుదల చేస్తారని తెలిపారు,  తల్లిదండ్రులు బాల్య వివాహాలు జరిపిస్తే వాటి వల్ల కలిగే నష్టల గురించి వారికి పూర్తి అవగాహన కల్పిస్తారని తెలిపారు. 

       బాలికలు బాగా చదువుకొని ఉన్న స్థాయికి చేరి మీ తల్లిదండ్రులకు, కళాశాలకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. మీరు చదివిన చదువు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని, మీరు మీ లక్ష్యాలను ఎంచుకొని వాటిని నెరవేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రొఫెసర్ ఉషారాణి, ఆఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రూప్మిణి,అధ్యాపకులు,  బాలికలు తదితరులు పాల్గొన్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *