6, మార్చి 2023, సోమవారం

శ్రీకాళహస్తిలో భక్త కన్నప్పకు విశేష అభిషేక పూజలు

శ్రీకాళహస్తిలో  భక్త కన్నప్పకు విశేష అభిషేక పూజలు


         భక్తాగ్రేసుడు అచంచల భక్తి తత్పరుడు భక్త కన్నప్ప పరమేశ్వరుడిలో ఐక్యం అయినా పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి కైలాసగిరి కొండల్లో వెలసి ఉన్న శ్రీ భక్త కన్నప్ప మూలవిరాటుకు విశేష అభిషేక పూజలు శాస్త్ర యుక్తంగా నిర్వహించారు.  విశేష అభిషేక పూజలు లో ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పాల్గొన్నారు. 


           పాల్గణ  పౌర్ణమి రోజున భక్త తత్పరుడు అచంచల భక్తి పరుడు తిన్నడు అయినా భక్తకన్నప్ప కు కైలాసనాధుడు మోక్ష ప్రదాత శ్రీకాళహస్తీశ్వరుడు  మోక్షాన్ని అనుగ్రహించి తనలో ఐక్యం చేసుకున్నట్లు పురాణ ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. సోమవారం పాల్గ ణ  పౌర్ణమి కావడంతో  శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో కైలాసగిరి కొండల్లోని భక్తకన్నప్ప ఆలయంలో  విశేష అభిషేక పూజలను చేపట్టారు. సోమవారం సాయంత్రం ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో భక్తకన్నప్ప మూలవిరాట్ కు విశేష అభిషేకాలు నిర్వహించారు.  అనంతరం దివ్య అలంకారాలు చేసి,  ధూప దీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *