మదనపల్లి గ్రామీణ మండలంలో యువకుడి దారుణ హత్య..
మదనపల్లి గ్రామీణ మండలంలో యువకుడి దారుణ హత్య..
మదనపల్లి గ్రామీణ మండలం కోళ్ల బైలు జలపాతం సమీపంలో గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటన స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో హత్యకు గురైనట్లుగా తెలుస్తోంది. మృతదేహాన్ని ఆనవాళ్లు తెలియకుండా అగంతకులు కాల్చివేశారు. శవం కుళ్లిపోయి, దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు, మదనపల్లి తాలూకా సిఐ సత్యనారాయణ ఎస్ఐ చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. హతుడి వివరాలు, హత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్చిఉంది.