ఇక విశాఖ పరిపాలనా రాజధాని : ముఖ్యమంత్రి సంచలన ప్రకటన
ఇక విశాఖ పరిపాలనా రాజధాని
మరో సరి ముఖ్యమంత్రి సంచలన ప్రకటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఈ కల నెరవేరబోతుందని ప్రకటించారు. తాను కూడా ఇక్కడి నుంచే పరిపాలన చేయబోతున్నానని ప్రకటించారు. విశాఖలో రెండురోజుల పాటు కొనసాగనున్న గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఉన్న అమరావతిని కాదని మూడు రాజధానుల బిల్లును తీసుకువచ్చిన జగన్ ప్రభుత్యం విరమించుకుంది. పరిపాలన రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని అసెంబ్లీలో బిల్లును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి ,హైకోర్టు నుంచి అభ్యంతరం రావడంతో బిల్లును విరమించుకుంది. ఆ తరువాత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది.
కోర్టులో విచారణ కొనసాగుతుండగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏపీకి ఒకే ఒక రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ దాదాపు నాలుగు సంవత్సరాలుగా అమరావతి రైతులతో పాటు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.