3, మార్చి 2023, శుక్రవారం

పెద్దిరెడ్డి ఎందులో గొప్ప? నారాలోకేష్ ఘాటు విమర్శలు

పెద్దిరెడ్డి ఎందులో గొప్ప?

యువగళంలో నారాలోకేష్ ఘాటు విమర్శలు 


           పుంగనూరు నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన TDP  జాతీయ కార్యదర్శి నారా లోకేష్లో మంత్రి పెద్దిరెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  యువగళం 33వ రోజు పాదయాత్రలో భాగంగా లోకేష్ శుక్రవారం పుంగనూరు నియోజక వర్గంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ..  పుంగనూరులో పీ3 ఫార్ములా అమలవుతోందన్నారు. నియోజకవర్గంలో ఒక్క పనికూడా జరగలేదన్నారు. పెద్దిరెడ్డిని  పెద్దాయన అని ఎందుకు అనాలని ప్రశించారు. భూములు దోచినందుకా ? ఇసుక తిన్నందుకా?  మట్టిమాఫియాను ప్రోత్సహించినందుకా? అని ప్రశ్నించారు. గంజాయిని ఎక్కువగా సరఫరా చేస్తున్నందుకు పెద్దిరెడ్డిని పెద్దాయన అనాలా? అని అడిగారు. ఇక్కడ  కాంట్రాక్టు ఎవరూ తీసుకోకూడదన్నారు.  గతంలో ఒక వైసీపీ నాయకుడు తీసుకున్నాడని, పనులు చేశాడని, బిల్లులు రాక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడన్నారు.

      పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ కోసం మిగతా డెయిరీలను నాశనం చేస్తున్నాడని లోకేష్ ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని, దీంతో రైతులు ఆవులను అమ్మేసుకున్నారన్నారు. రెండున్నర ఏళ్లలో శివశక్తి సంస్థ రైతుల కష్టార్జితం 20 కోట్ల రూపాయలు దోచుకుందన్నారని ఆరోపించారు.  రాష్ట్రమంతా అమూల్ కంపెనీలను పెట్టిన జగన్ రెడ్డి, పుంగనూరులో మాత్రం పెట్టలేదన్నారు. అది కేవలం పెద్దిరెడ్డి కోసమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తారని, పుంగనూరును ప్రక్షాళన చేసి, ఆయనకు  చెక్ పెడతామన్నారు. పెద్దిరెడ్డి తమ్ముడి కొడుకు సుదీర్ రెడ్డి పల్ప్ కంపెనీ కోసం మామిడి రైతులు పంట తమకే అమ్మాలని బెదిరిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. బయటివారికి మామిడి పంటను అమ్మకుండా పెద్దిరెడ్డి అడ్డుపడుతున్నాడన్నారు. బెదిరించి లాక్కున్నాడన్నారు. మామిడి రైతుల నుంచి మూడేళ్ల కాలంలో పెద్దిరెడ్డి సంస్థ 100 కోట్ల రూపాయల దోచుకుందన్నారు.




అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *