6, మార్చి 2023, సోమవారం

హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటాం?

     


 
  హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటాం?

           హోలీ (HOLI) అంటే  రంగుల పండుగ. పురాణ కథలతో పాటుగా హోలీ పండుగ వెనుక మరో పరమార్థం ఉంది. హోలీ పండుగను వసంత ఋతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది చలికాలం తొలగి పోయి ఎండాకాలం ఆరంభానికి నాంది ప్రస్థావన వంటిది. హోలీ పండుగను సాధారణంగా “ఫాల్గుణి పూర్ణిమ” నాడు జరుపుకుంటారు. ఇలా ఒక రుతువు వెళ్లి మరో రుతువు వచ్చే సమయంలో ముఖ్యంగా శీతాకాలం ‘చలి’ వెళ్లిపోయి ఎండాకాలం ‘వేడి’ వచ్చే సమయంలో ఉష్ణోగ్రతల తేడావల్ల చర్మం  చిట్లుతుంది. రంగులు ఆ చిట్లటం వల్ల కలిగే చికాకును తగ్గిస్తాయి.

       కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. తల్లితో కృష్ణుడు తన శరీర వర్ణం, రాధ మేనిఛాయ మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని అంటారు. దీంతో కృష్ణుడి తల్లి రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంత ఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు.

        దీపావళి తర్వాత దేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో హోళీ  ఒకటి. పురాణాల ప్రకారం ఈ పండుగను సత్యయుగం నుంచి దేశంలో జరుపుకుంటున్నట్లు తెలియజేస్తున్నాయి. హోళీ  అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం వస్తుంది. హోళీని హోళికా పూర్ణిమగా కూడా పిలుస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అంటారు.

                         
ఈ పండుగ పుట్టుపుర్వోత్తరాల గురించి పురాణాల్లో గాథలు ప్రచారంలో ఉన్నాయి. 
చివరిగా ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ఇది తెలిసిన ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది. ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాం.

         హోలీ పుట్టుక వివరాల గురించి మరో కథ కూడా ఉంది. ఈ కథ ప్రేమ దేవుడైన కాముడు గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కాముడు శరీరాన్ని శివుడు నాశనం చేసాడు. తరువాత శివుడు, తన త్రినేత్రాన్ని తెరిచి, కాముడు శరీరాన్ని బూడిద చేశాడు. కామదేవుని భార్య రతి కోరికమేరకు శివుడు కాముడిని మళ్లీ బతికిస్తాడు.  కానీ, భౌతికంగా మానసిక ప్రతిరూపంగా మాత్రమే బతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *