ఉద్యమ అభ్యర్థులను గెలిపించండి! CPM
ఉద్యమ అభ్యర్థులను గెలిపించండి!
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపు
ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఉద్యమ పిడిఎఫ్ అభ్యర్థులైన మీగడ వెంకటేశ్వర్ రెడ్డి, బాబు రెడ్డిలను గెలిపించాలని శనివారం సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల, కార్మికుల, కష్టజీవుల సమస్యలపై పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నిరంతరం పోరాడారని అన్నారు. గతంలో మూడుసార్లు పిడిఎఫ్ అభ్యర్థులను పట్టభద్రులు, ఉద్యోగులు, కార్మిక సంఘాలు, మేధావులు గెలిపించారు అని అన్నారు. శాసనమండలిలో వీళ్లు ఉద్యోగులు నిరుద్యోగులు సమస్యలపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తమ గళాన్ని వినిపించారని అన్నారు. మార్చి 13వ తేదీ జరుగుతున్న ఎన్నికలలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కార్మిక వర్గానికి, ఉద్యోగులకి, మేధావులకు, వామపక్ష పార్టీలకు సంబంధించిన అన్ని కార్మిక సంఘాలకు, ప్రజా సంఘాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తూ ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడుతున్నది. దీనికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, నాయకులు సురేంద్ర న్,పి.చైతన్య లతో వామపక్షాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు