7, మార్చి 2023, మంగళవారం

ఏప్రిల్ 3 నుండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు



ఏప్రిల్ 3 నుండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు:   డి.ఆర్ .ఓ. యన్ . రాజశేఖర్. 

 పదవ తరగతి  పరీక్ష కేంద్రాలు 115.
 విద్యార్థులు 21,996 – (బాలురు 11,140,
 బాలికలు 10,556)
 ఏప్రిల్  3 వ తేదీ  నుండి 18 వ తేదీ వరకు. 
 ఉదయం 9.30 గం నుండి మ 12 .45 గంటల వరకు, 
 ఉదయం 9 గంటలకల్లా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.  

* పరీక్ష కేంద్రం లోనికి ఎవ్వరు మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదు.

     జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఓపెన్ స్కూలు పరీక్షలు సంబంధిత అధికారులు సమన్వయం చేసుకొని విజయవంతంగా నిర్వహించాలని
డి . ఆర్ .ఓ  యన్ . రాజశేఖర్ ఆదేశించారు. 

    డి ఎస్పీ శ్రీనివాస్ మూర్తి, ఆర్ ఐ ఓ,వి.రమేష్,డీఈఓ.విజేంద్ర రావ్,ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పి.గురుస్వామి రెడ్డి లతో కలసి మంగళవారం ఉదయం డి .ఆర్ .ఓ  సమావేశం హాల్   నందు  10 వ తరగతి,ఇంటర్మీడియట్, ఓపెన్ స్కూల్  పరీక్షలు నిర్వహణ పై  , రెవెన్యూ, వైద్య, రవాణా , విద్యుత్తు , పోలీసు , పోస్టల్, ఖజానా, మున్సిపాలిటీ, పంచాయతీ,ఆర్ టి సి, శాఖ అధికారుల తో 
 సమన్వయ సమావేశం  నిర్వహించారు.

       ఈ సంధర్భంగా  డి ఆర్ ఓ మాట్లాడుతూ జిల్లా లో  ఏప్రిల్ 03 నుండి 18 వ తేదివరకు జిల్లాలో నిర్వహించే  పదవ తరగతి పరీక్షలు సంబందితా అధికారులు సమన్వయం చేసుకొని ఏ లాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రతగా  విధులు  నిర్వహించాలన్నారు. 

     జిల్లాలో 115 పరీక్ష కేంద్రాల్లో 21,996 మంది విద్యార్థులు ,అందులో బాలురు 11,140 మంది , బాలికలు 10556 మంది, ప్రైవేట్  విద్యార్థులు  436 మంది, అందులో బాలురు 268 మంది , బాలికలు 168 మంది , పరీక్షలు రాస్తున్నారని  తెలిపారు .
 ఉదయం 9.30 గం నుండి మధ్యాహ్నం 12 .45 గంటల వరకు పరీక్ష లు ఉంటాయని, విద్యార్థులు ఉదయం 9 గంటలకల్లా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్ టిక్కెట్లును  పాఠశాలలో సకాలం లో విద్యార్థుల కు ఇచ్చేలా   చర్యలు తీసుకోవాలని డి ఈ ఓ ను ఆదేశించారు.

      పరీక్షా కేంద్రాలలో సిటింగ్, లైటింగ్, త్రాగు నీరు, మరుగుదొడ్లు ఉండేలా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 9 గంటల కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకొనే విదంగా ఆర్.టి.సి బుస్సు లను నడపాలని ఆర్టీసీ అధికారులను,  పరీక్ష సమయం లో విద్యుత్ ఆంతరాయం కలగకుండా చూడాలని సంబందితా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు రవాణా శాఖ అధికారులు అవసరమైన వాహనాల  ఏర్పాట్లు చేయాలని, పరీక్షలు పూర్తి అయిన తరువాత సమాధాన పత్రాలను సీల్డ్ కవర్ లో పోస్టల్ శాఖ కు అందజేసిన వెంటనే పోస్టల్ శాఖ పంపించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల నందు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్స్, ఏ.ఎన్.ఏం లను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని  ఆదేశించారు. మున్సిపాలిటిలోను, పంచాయతీలలోను పరీక్ష కేంద్రల నందు   శానిటేషన్ చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. 

   ఉదయం 8 గంటల  నుండి  మధ్యహనం 1 గంటల వరకు పరీక్ష కేంద్రాల సమీపం లో వున్న  జిరాక్స్ షాప్ లను మూసివేయాలన్నారు. పరీక్ష కేంద్రాల నందు అవసరమైన పోలీసు బందోబస్తును, పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ శాఖ కు చూచించారు.
  సమస్యాత్మక పరీక్ష కేంద్రాల లో సీసీ కేమరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *