MLC ఎన్నికలకు ఈ నెల 13 న పోలింగ్, 16 న ఓట్లు లెక్కింపు: జాయింట్ కలెక్టర్
MLC ఎన్నికలకు ఈ నెల 13 న పోలింగ్, 16 న ఓట్లు లెక్కింపు
* పి ఓ. అందజేసిన మార్కర్ పెన్ తో నే నెంబర్ మార్క్ చేయాలి.
* పట్టభద్రుల మొత్తం 3,81,181 మంది ఓటర్లు.
* పురుషులు : 2,45,866 మంది.
* మహిళలు : 1,35,284 మంది.
* పోలింగ్ కేంద్రాలు : 453.
చిత్తూరు జిల్లాకు సంబంధించి : 54,152 మంది ఓటర్లు.
* పురుషులు : 35,189 మంది.
* మహిళలు : 18,960 మంది.
* పోలింగ్ కేంద్రాలు : 69.
* ఉపాధ్యాయుల మొత్తం : 27,694 మంది ఓటర్లు.
* పురుషులు : 16,825 మంది.
* మహిళలు :10,869 మంది.
* పోలింగ్ కేంద్రాలు : 176.
* చిత్తూరు జిల్లాకు సంబంధించి : 3887 మంది.
* పురుషులు : 2341 మంది.
* మహిళలు : 1546 మంది.
* పోలింగ్ కేంద్రాలు : 31.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గం పట్టభద్రుల, ఉపాధ్యాయల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు అవగాహన కలిగించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ కోరారు.
అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు డిఆర్ఓ యన్. రాజశేఖర్ తో కలిసి బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశం హాల్ నందు ఈనెల 13న మరియు 16 న జరిగే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ పట్టభద్రుల, ఉపాధ్యాయల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు పూర్తి అవగాహన కలిగించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు చూచించారు. పి ఓ ఇచ్చిన మార్కర్ పెన్ తోనే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పట్టబద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ చేసిన పోలింగ్ కేంద్రాలు జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేయడం జరిగిందని, పట్టభద్రుల సంబంధించి ఓటు హక్కు వినియోగించే ఓటర్ల కు ఎడమచేతి చూపుడు వేలుకు, ఉపాధ్యాయుల సంబంధించి ఓటు హక్కు వినియోగించే ఓటర్లు కు కుడి చేయి మధ్య వేలు పై మార్కింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకునేవారు తప్పనిసరిగా ఏ దైన గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకు రావాలి, ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు,పాస్ పోర్టు, పట్టాదార్ పాస్ పుస్తకం, ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఆ శాఖకు సంబంధించిన ఐడి కార్డును ఏ దైన ఒక్కటి గుర్తింపు కార్డు తో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవనని తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ కి బ్యాలెట్ పేపర్ తెలుపు రంగు గాను, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కి బ్యాలెట్ పేపర్ పింక్ కలర్ లో ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో ఓటు ఎలా వేయాలి (హౌ టు ఓట్) దానికి సంబంధించి పోస్టర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు కు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్ నియమించుకునే అభ్యర్థులు పిఓ ద్వారా ఐడి కార్డు పొందవచ్చునని తెలిపారు. ఈనెల 13న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, ఈనెల 16న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం ప్రారంభంవుతుందని. పట్టభద్రుల కు సంబంధించి కౌంటింగ్ కేంద్రాన్ని ఆర్ వి ఎస్ కళాశాల నందు ఉపాధ్యాయుల ఓట్లు లెక్కింపుకు సంబంధించి లా కాలేజ్ నందు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓట్లు లెక్కింపు కేంద్రంలోనికి ఫారం 18 ద్వారా పాస్ పొందవలసి ఉంటుందన్నారు. పట్టభద్రుల ఓట్లు లెక్కింపుకు 20 టేబుల్ ను, ఉపాధ్యాయుల ఓట్లు లెక్కింపునకు 14 టేబుల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కి ఓట్లు వేయు ఓటర్లకు బిఎల్ఓ ల ద్వారా ఓటర్ స్లిప్పులు అందజేసి, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలని దానిపై ఓటర్లకు అవగాహన కలిగించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ తరపున ఎమ్మెల్యే పి ఆర్ ఓ. నరసింహులు,తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర కార్యదర్శి వి.సురేంద్ర కుమార్,బిజేపీ తరపున జిల్లా జనరల్ సెక్రటరీ కె.చిట్టి బాబు,కాంగ్రెస్ పార్టీ తరపున పరదేసి, సి పి ఐ పార్టీ తరపున వి.గంగ రాజు పాల్గొన్నారు.