పోలింగ్ కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ హరి నారాయణ
ఈనెల 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలలో పకడ్బందీగా పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి యం. హరి నారాయణ తహసీల్దార్లు, ఎంపీడీ ఓ లను ఆదేశించారు.
మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ గుడిపాల, యాదమర్రి మండలాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రకాశం -నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ మార్చి 13న నిర్వహించే ఎం ఎల్ సి ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన విద్యుత్ సౌకర్యము ఇతర సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని ర్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. వెబ్ కాస్టింగ్ నిమిత్తం అవసరమైన ఇంటర్ నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రాలలో పట్టభద్రుల మరియు ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ నెంబర్ ను పెయింట్ చేయాలని సూచించారు. తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్భందీగా ఎన్నికల నిర్వహణకు తహశీల్దార్ లు, ఎం పి డి ఓ లు చర్యలు చేపట్టాలని సూచించారు.