1, ఫిబ్రవరి 2024, గురువారం

కొలిక్కి వస్తున్న టీడీపీ టిక్కెట్లు



తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఖరారుపై దృష్టిని సారించారు. గత రెండు రోజులుగా చంద్రబాబు ఎవరితో మాట్లాడటం లేదు. నాలుగో తరీఖులోపు అభ్యర్థుల జాబితా ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. జిల్లాల వారిగా అభ్యర్థుల ఖరారు కార్యక్రమంలో బాబు తలమునకలై ఉన్నారు. ఐదవ తేదీ తరువాత అభ్యర్థుల ప్రకటన ఉండవచ్చని భావిస్తున్నారు. బాబు అభ్యర్థుల మీద దృష్టిని సారించడంతో  జిల్లాలోని అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది.జిల్లాలోని కొంతమంది నాయకుల పనితీరు మీద చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిమీద జిల్లాలోని నాయకులు సరిగా స్పందించలేదు. ఖండించలేదు. దీంతో బాబు చాలా ఆవేదన చెందినట్లు తెలిసింది. ఈ నేపద్యంలో టిక్కెట్ల ఖరారు జరుగుతోంది. కావున ఇంచార్జిలలో గుబులు నెలకొంది.


రాష్ట్రం రాజకీయాలలో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే అయిదు జాబితాలు విడుదల అయ్యాయి. టిడిపి జాతీయ అధ్యక్షుడు వెనుకబడి ఉన్నారని ఆ పార్టీ నేతలే పలువురు అంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొందరు చంద్రబాబు తీరుపై విమర్శలు చేస్తున్నారు. జగన్ పనికి రారని పక్కన పెట్టిన నేతలను చంద్రబాబు, లోకేష్ అక్కున చేర్చుకోవడం పట్ల అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఉమ్మడి జిల్లాలో టిడిపికి ఆధిక్యం రాకపోవచ్చని రాజకీయ పరిశీలకులు జోస్యం చెపుతున్నారు. కుప్పంలో కుడా మెజారిటీ తగ్గవచ్చని అంటున్నారు.  ఇప్పటి వరకు అభ్యర్థులను తెల్చక పోవడం, మళ్ళీ బలహీన నేతలకు టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉంటుందని వస్తున్న వార్తలు చూసి కలత చెందుతున్నారు.

 సత్యవేడు  ఎమ్మెల్యే అధిమూలం టిడిపిలో చేరుతారని వస్తున్న వార్తలు చూసి కార్యకర్తలు మండి పడుతున్నారు. పనికిరాడని జగన్ పక్కన పెట్టిన ఆయనను లోకేష్ ఆదరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పిచ్చాటూరు మండలం గోవర్ధన గిరిని చెందిన చిరంజీవి రాజు ఆమేరకు ఒక వీడియో విడుదల చేశారు. ఆధిమూలం ఈ ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలను వేధించారని, అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే తమ పరిస్తితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. టిడిపి ఎక్కడికి పోతున్నది అంటూ అవేదన చెందారు. తిరుపతిలో బలిజ సామాజిక వర్గం నేతల పేర్లు మాత్రమే టికెట్టు కోసం పరిశీలించడం పట్ల బిసి నేతలు మండిపడుతున్నారు. సగం నియోజక వర్గాలలో ఇంచార్జిలు పనికి రారని అంటున్నారు. అలాగే కొంత మంది కోవర్టులను పక్కన పెట్టక పోవడం వల్ల పార్టీకి తీరని నష్టం తప్పదని ఒక నాయకుడు చెప్పారు. 

తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, జి డి నెల్లూరు నియోజకవర్గాలను జనసేన నేతలు ఆశిస్తున్నారు. దీనితో టిడిపి కార్యకర్తల్లో అసహనం నెలకొన్నది. ఇదిలా ఉండగా కొంత మంది టిడిపి నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇక్కడ టికెట్టు రాని వారిలో కొందరు  గోడ దూకడానికి సిద్దంగా ఉన్నారని తెలిసింది. టిడిపిలో డబ్బు ఉన్నవారికే టికెట్టు ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. భారీగా డబ్బు ఖర్చు పెట్ట గలిగితే ఎవరికైనా టికెట్టు ఇస్తారని, ఇక పార్టీ కోసం పని చేయడం ఎందుకు అంటున్నారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సి కె బాబును పక్కన పెట్టడం పట్ల చాలా విమర్శలు ఎదురవుతున్నాయి. తిరుపతి జనసేనకు ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు తప్పవని సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *