చిత్తూరు పార్లమెంటు రేసులో సినీనటుడు సప్తగిరి
చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ టిక్కెట్టును సినీనటుడు సప్తగిరి ఆశిస్తున్నారు. ఆయన పూతలపట్టు నియోజకవర్గ అభ్యర్థిగా కూడా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ఇప్పటికే చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని కోరుతూ పలువురు ఆశావాహులు కోరుతున్నారు. అధిష్టానం మాత్రం ప్రజాకర్షణ కలిగిన సప్తగిరి వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సినీ నటుడు సప్తగిరి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. పార్టీ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ఆశీస్సులు కూడా తమకు ఉన్నట్లు వారికి చెప్పారు.
సప్తగిరి సొంత నియోజకవర్గ పూతలపట్టు కావడం ఐరాల మండలం నాంపల్లి. సప్తగిరి ఇదే నియోజకవర్గంలోని బంగారు పాల్యం జూనియర్ కళాశాల, జిల్లాలోని మదనపల్లి డిగ్రీ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నట్లు తెలిసింది

