కన్నతల్లిని చంపిన కూతురు
కుటుంబ కలహాలతో సొంత తల్లినే కన్న కూతురు హతమార్చిన ఘటన ఆదివారం వాల్మీకిపురంలోని కొత్త ఇందిరమ్మ కాలనీలో జరిగిందని స్థానికులు వెల్లడించారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహల్కు చెందిన కె.యర్రక్క (43) వలస వచ్చి స్థానికంగా నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో కూతురు నందిని, అల్లుడు శివరాం కలసి కర్రతో యర్రక్కను కొట్టి చంపేశారు. ఎస్ఐ నాగేశ్వర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.