16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

చిత్తూరు పార్లమెంటులో గెలుపు గుర్రాలకే సీట్లు


చిత్తూరు పార్లమెంటు పరిధిలో గెలుపు గుర్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. గత ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు మినహా ఆరు ఎమ్మేల్యే స్థానాలలో ఓడిపోయారు. లోక్ సభ స్థానం కూడా పోగొట్టుకున్నారు.  ఒక విధంగా ఇది చంద్రబాబుకు  చిన్న తనంగా చెప్పవచ్చు. దీంతో ఈ సారి సర్వేలు, కుల సమీకరణాలు అంటూ ప్రయోగాలు చేయడంమాని  గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. 

ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రమైన చిత్తూరు నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే సి కె బాబు లేదా పారిశ్రామిక వేత్త గురజాల జగన్ మోహన్ నాయుడుకు టికెట్టు ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇక్కడ వైసిపి అభ్యర్థి ఎం సి విజయానంద రెడ్డిని ఢీ కొట్టాలంటే సి కె బాబు ఒకరే సమర్థుడు అంటున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి సి కె బాబును కలసి చర్చించారు. గురువారం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సి కె దంపతులను కలసి మాట్లాడారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా ఆయన పేరును సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఏ కారణం చేత అయినా ఆయన కాక పోతే గురజాల జగన్ మోహన్ నాయుడుకు టికెట్టు వస్తుందంటున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ ఇతర సామజిక సమీకరణాలు పనిచేయవు అంటున్నారు. 

కాగా పలమనేరు ఇంచార్జి అమరనాద రెడ్డిని పుంగనూరు అభ్యర్ధిగా పోటీ పెట్టి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని కట్టడి చేయాలని భావిస్తున్నారు. ఆయన అయితేనే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి గట్టి పోటీ  ఇస్తారని అన్ని సర్వేలలో వెల్లడి అయినట్టు తెలిసింది. పలమనేరు నియోజకవర్గంలో అమరనాద రెడ్డి తమ్ముడు శ్రీనాథ్  రెడ్డి లేదా శ్రీనాథ్ రెడ్డి భార్య అనీషా రెడ్డికి టికెట్టు ఇచ్చే అవకాశం ఉంది. నగరి, లేదా చంద్రగిరి నియోజక వర్గంలో కూడా రెడ్డి సామాజిక వర్గం వ్యక్తికి టికెట్టు ఇస్తే గెలుపు సాధ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి కుమారుడు అయిన ఆయనకు సర్వే రిపోర్టులు అనుకూలంగా ఉన్నాయని తెలిసింది. సి కె బాబు, హర్ష వర్ధన్ రెడ్డి లకు టికెట్టు ఇస్తే ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన జి డి నెల్లూరు, పూతలపట్టు నియోజక వర్గాలలో కూడా గెలవడానికి వీలుంటుంది అంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *