ఏపీలో ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం !
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను పెట్టాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం అయ్యింది. ఈ మేరకు రాష్ట్రంలోని లోక్ సభ నియోజకవర్గాల్లోఎన్నికల కార్యాలయాలను ప్రారంభించారు. లోక్ సభ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితా సిద్ధం అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో 37 మందితో ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 4 తరువాత అమిత్ షా, రాజ్ నాథ్ , నడ్డా పర్యటనలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీలతో బీజేపీ అగ్రనేతల సమావేశమై దిశానిర్ధేశం చేస్తారు.
బీజేపీని తమ కూటమిలోకి తీసుకురావాలనే చంద్రబాబు - పవన్ కల్యాణ్ ప్రయత్నాలు విఫలమైనట్లు సమాచారం. బీజేపీని తమ కూటమిలోకి తీసుకొచ్చి ఎన్నికల్లో వాడుకుందామని చూసిన బాబుకు కమలనాథులు జలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పొత్తు పెట్టుకుంటే 80 అసెంబ్లీ సీట్లు, 12 లోక్ సభ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. లేదా టీడీపీని బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. 1999, 2014లో బీజేపీతో పొత్తుతోనే టీడీపీ గెలిచింది అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ చంద్రబాబుకు సహకరించికూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
బీజేపీతో పొత్తు కోసం పురందేశ్వరి, పవన్, బీజేపీలో ఉన్న చంద్రబాబు మనుషులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ మోదీ -అమిత్ షా లు అంగీకరించలేదని సమాచారం. చంద్రబాబు రాజకీయ జీవితం చివరి దశకు చేరుకుందని, 2024 ఎన్నికలు బాబుకు చివరి ఎన్నికలని బీజేపీ పెద్దలు ఢిల్లీలో చెబుతున్నట్లు సమాచారం. ఏపీలో సీఎం వైఎస్ జగన్ చాలా బలంగా ఉన్నారని, ఆయనను ఎదుర్కోవడం టీడీపీ కూటమికి సాధ్యం కాదని బీజేపీ పెద్దలు తమ అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుంటున్నట్లు సమాచారం.