5, ఫిబ్రవరి 2024, సోమవారం

స్వామికి వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన




 గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి నియోజకవర్గంలో మళ్లీ నిరసన తప్పడం లేదు. ఇటీవల మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో మంతనాలు జరిపిన ప్రయోజన సూన్యంగా మారింది. డిప్యూటీ సీఎం కి రోజురోజుకు పెరగడం ఎక్కువవుతుంది.

 సోమవారం మండలంలోని మాజీ నేతలయిన సి డి సి ఎం చైర్మన్ వేల్కూరు బాబు రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుణశేఖర్ మొదలియార్, సింగల్ విండో చైర్మన్ నారాయణరెడ్డి, ఇంకా పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు,  ప్రజా ప్రతినిధులు వీరితో నియోజకవర్గంలో అసమ్మతి నేతలంతా ఒక్కటై జగన్ ఎన్నికల శంఖావరానికి మేం సిద్ధం. కానీ నారాయణస్వామి అభ్యర్థునికి మాత్రం మేము ఒప్పుకో అంటూ నినాదాలు చేశారు. అనంతరం మండల కేంద్రం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.

 నారాయణస్వామి  వద్దు..

వాస్తవ పరిస్థితులకు వెళితే నియోజకవర్గంలో గత రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికైన దళిత వ్యక్తి, డిప్యూటీ సీఎం గా ఉంటూ ఎక్కడ అభివృద్ధి కావడం లేదని పలువురు నేతలు ప్రజాప్రతినిధులు ధిక్కారస్వరం వినిపించారు. నారాయణ స్వామికి సీటు ఇస్తే మాత్రం ఒక ఓటర్ గా ఉంటామే కానీ,, నేతగా పనిచేయమని నినాదాలు చేశారు. నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతను గ్రహించి జిల్లా పెద్దలు సీఎం దృష్టికి తీసుకువెళ్లి అభ్యర్థి మార్పు చేయాల్సి ఉందని పలువురు కోరారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *