7, ఫిబ్రవరి 2024, బుధవారం

తిరుపతి టిడిపి ఎంపి అభ్యర్థిగా నిహారిక !




తిరుపతి లోక్ సభ టిడిపి అభ్యర్థిగా   అంగలకుత్తి  నీహారిక పేరు ఖరారు అయినట్టు తెలిసింది. మాజీ ఐఏఎస్ అధికారి రత్న ప్రభ కుమార్తె అయిన ఆమె మాజీ రాజ్యసభ సభ్యుడు మనోహర్ కోడలు. ఆమె తండ్రి కె చంద్రయ్య కూడా ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. 



రత్నప్రభ కర్ణాటక రాష్ట్ర సి ఎస్ గా పనిచేసి రిటైర్ అయ్యాక బిజెపిలో చేరారు. 2021లో జరిగిన తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 57,080 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్థి మద్దిల గురుమూర్తి తన సమీప ప్రత్యర్థి టిడిపి అభ్యర్ధి పనపాక లక్ష్మి పైన  2,71,592 ఓట్ల మెజారిటీ సాధించారు.  సాప్ట్ వేర్ ఇంజనీర్ అయిన నీహారిక మాదిగ సామాజిక వర్గం కావడం కలసి వచ్చింది. రాష్ట్రంలో నాలుగు లోక్ సభ స్థానాలు, 29 అసెంబ్లీ నియోజక వర్గాలు ఎస్సీ సామాజిక వర్గాల వారికి రిజర్వ్ చేశారు. ఇందులో సగం స్థానాలు తమకు కావాలని మాదిగ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కీలక పాత్ర పోషించారు. ఆ మేరకు చంద్రబాబు కూడా గతంలో హామీ ఇచ్చారు. దీనితో తిరుపతి, బాపట్ల స్థానాలు మాదిగలకు, అమలాపురం, చిత్తూరు స్థానాలు మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించారు.




 1999లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నందిపాక వెంకట స్వామి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ పై 12,497 ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే 2009 లో వర్ల రామయ్య టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి చింతా మోహన్ చేతిలో 19,276 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఆ సామాజిక వర్గానికి కేటాయించారు. మొదటి జాబితాలో ఆమె పేరు ప్రకటిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. 

ఇదిలా ఉండగా సత్యవేడు ఎమ్మెల్యే స్థానం కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన హెలెన్ కు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే జేడి రాజశేఖర్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. దీనితో ఉమ్మడి జిల్లాలో ఇక మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు అవకాశాలు లేవని అంటున్నారు. చిత్తూరు లోక్ సభ స్థానం మాల సామాజిక వర్గానికి ఇస్తారని అంటున్నారు. దీనితో  మాజీ కేంద్రమంత్రి పనపాక లక్ష్మీ, గంగాధర నెల్లూరుకు చెందిన రిటైర్డ్ ఎస్పీ చిన్నస్వామి, తిరుపతికి చెందిన మాజీ IRS అధికారి హరిబాబు, పూతలపట్టు మాజీ MLA డా. రవి, శాంతిపురానికి చెందిన జయప్రకాశ్, జిల్లా SC సెల్ అధ్యక్షుడు పీటర్, సినీనటుడు సప్తగిరి ప్రసాద్, జీడీ నెల్లూరు టీడీపీ ఇంచార్జి థామస్ సోదరుడు నిధి కూడా చిత్తూరు పార్లమెంటు టిక్కెట్టును ఆశిస్తున్నారు.  

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *