కాణిపాకంలో ఉభయదారుల ధర్నా
కాణిపాకం దేవస్థానం కార్య నిర్వాహణాధికారి కార్యాలయం ముందు శుక్రవారం కాణిపాకం ఉభయదారులు ధర్నా చేశారు. గురువారం ఆలయ చైర్మన్, ఈవో కాణిపాకం చరిత్ర గ్రంథమును ముఖ్యమంత్రి జగన్ దగ్గర ఆవిష్కరించడంతో ఉభయ దారులు భగ్గుమన్నారు.
కాణిపాకం కార్యక్రమాల్లో ఉభయ దార్లకి ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ఆలయ ఈవో, చైర్మన్ పై ఉభయ దారులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆవిష్కరించిన ఆ పుస్తకంలో ఉభయదారుల ప్రస్థానం లేదని ఆరోపించారు. కాణిపాకం ఇంత అభివృద్ధి చెందిందంటే ఉభయదారులు కృషి ఉందని, తమను ఎలా విస్మరిస్తారని ప్రశ్నించారు. ఉభయ దారులు ఉనికి లేకుండా చేయడానికి ఈవో ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. తక్షణమే ఈవో క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈవోను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు ధర్నా విరమించింది లేదని ఉభయ దారులు భీష్మించి కూర్చున్నారు.