దళితులకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు !?
బిజెపి తిరుపతి జిల్లా ప్రచార కార్యదర్శి సతీష్ రెడ్డి ఆరోపణ
మతం మారిన వారికి టికెట్లు ఇచ్చి, దళిత హిందువులకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తున్నారని సామాజిక కార్యకర్త, బీజేపీ తిరుపతి జిల్లా ప్రచార కార్యదర్శి యం సతీష్ రెడ్డి ఆరోపించారు. హిందుత్వాన్ని మంటకలిపే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మైనారిటీ అయిన క్రిష్టియన్ లకు ఎస్సీ రిజర్వడు నియోజక వర్గాలలో టికెట్లు ఇవ్వడం అంటే దళితులను, అంబేత్కర్ ఆశయాలను ద్రోహం చేసినట్లేనన్నారు.
చిత్తూరు జిల్లాలోని జి డి నెల్లూరు నిజోజక వర్గంలో క్రిష్టియన్ మతం తీసుకున్న థామస్ కు టికెట్టు ఇచ్చారని తెలిపారు. అలాగే మతం మారిన హెలెన్ కు సత్యవేడు టికెట్టు ఇస్తారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న నాలుగు లోక్ సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో సగం పైగా మతం మారిన వారికి టికెట్టు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అంబేత్కర్ రాజ్యాంగంలో సుస్పష్టంగా చెప్పారని మతం మారితే కులం పోతుందని, అసలు క్రిష్టియన్ మతానికి ఏ రిజర్వేషన్ ను కూడా రాజ్యాంగంలో పొందు పరచలేదని తెలిపారు. ఈ విధంగా చంద్రబాబు దళితులకు టికెట్లను నిరాకరించి క్రిష్టియన్లకు టికెట్ ఇవ్వడం అంటే క్రిస్టియానిటి కి మద్దతు తెలుపుతూ దళితులను అవమనపరచడమేనని అన్నారు.
సత్యవేడు, గంగాధర నెల్లూరు నియోజక వర్గాల్లో దళిత నాయకులు ఎవ్వరూ లేరా అని ప్రశ్నించారు. కొన్ని రోజులక్రితం సత్యవేడు ఇన్చార్జి హెలెన్ డబ్బులు ఇచ్చి పదవి తెచ్చుకున్నారని పేపర్ లో చదివానని పరిస్థితులను గమనిస్తుంటే డబ్బులు ఇచ్చే క్రిష్టియన్ వాళ్ళకే పదవులు ఇస్తూ దళితులకు తీరని అన్యాయం చేస్తున్నారని వివరించారు. ఇలా హిందుత్వానికి తీరని అన్యాయం చేసిన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో మిగిలి పోతారని పేర్కొన్నారు. ఎస్ సి రిజర్వడ్ టికెట్స్ యస్ సి లకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాదని అన్యమతలవారికి ఏ పార్టీ వారు టికెట్స్ ఇచ్చినా చట్టప్రకారం చర్యలకు కోర్టులను ఆశ్రయిస్తామని యం సతీష్ రెడ్డి హెచ్చరించారు.