12, ఫిబ్రవరి 2024, సోమవారం

థామస్ కు గుదిబండగా మతం, నేరచరిత్ర




గంగాధర  నెల్లూరు టిడిపి ఇంచార్జి డాక్టర్ వి ఎం థామస్ రాజకీయ భవిష్యత్తుకు మతం మార్పిడి గుదిబండలా తయారయ్యింది. నేర చరిత్ర ప్రత్యర్ధుల పాలిటి వరంగా మారింది. పార్టీలో వర్గపోరు నియోజకవర్గంలో టీడీపీ గెలుపునకు ప్రతిబంధకం కానుంది. వీటి ఫలితంగా థామస్ అభ్యర్థిత్వం ప్రశ్నార్థకంగా తయారయ్యింది. ఆయన బలాలు అన్నుకున్నవే బలహీనతలుగా పరిణమిస్తున్నాయి. వీటి ఆధారంగా థామస్ ను రాజకీయంగా కట్టడి చేయాలని, రానున్న ఎన్నికలలో వాటి ఆధారంగా లబ్ధి పొందాలని వైసిపి నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. ఇవి ఫలిస్తే నియోజకవర్గంలో మరోసారి పోటి లేకుండా వైసీపీ జెండాను ఎగురవేయలని సిద్ధం అవుతున్నారు. అలా ఫలించని పక్షంలో ఎన్నికను హిందూ వర్సెస్ క్రిస్టియన్ గా తీసుకురావాలని పథక రచన చేస్తున్నారు. అలాగే థామస్ నేరచరిత్రను కరపత్రాలుగా ముద్రించి పంచిపెట్టాలని భావిస్తున్నారు.

కార్వేటినగరం మండలం అల్లాగుంటకు చెందిన ఆయన  బయో టెక్నాలజీ లో డాక్టరేట్ చేసి, చెన్నైలో సంతాన సాఫల్య కేంద్రం నడుపుతున్నారు. రెండేళ్ల క్రితం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్థానికులను కాదని థామస్ ను ఇంచార్జిగా నియమించారు. అప్పటి నుంచి ఆయన పలు రాజకీయ సమస్యలు, విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఆయన రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు మాట విని పలువురిని దూరం చేసుకున్నారు. నియోజక వర్గంలో బలమైన బంధువర్గం ఉన్న రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి నియోజక వర్గానికే రావడం లేదు. మాజీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆముదాల శ్రీహరి, కార్వేటినగరం మాజీ వైస్ ఎంపిపి, పాలసముద్రం మండల పార్టీ అధ్యక్షుడు రాజేంద్ర, గ్యాస్ రవి తదితరులు వ్యతిరేకిస్తున్నారు. పెనుమూరు మండలంలో ఒక వర్గం నేతలు నారాయణ స్వామికి లోపాయకారిగా సహకారాన్ని అందిస్తున్నారు.

గుదిబండలా మారిన మతం 
నియోజక వర్గంలో ఎస్సీ సామాజి వర్గంలో రెడ్లు అధికంగా ఉన్నారు. వీరితో పాటు క్రైస్తవ మతం తీసుకున్న దళితులు ఎక్కువగా ఉన్నారు. ఈ వర్గాలను ఆకట్టుకునేందుకు ఆయన తాను క్రైస్తవ మతం తీసుకున్నానని, తన భార్య రెడ్డి అని ఇటీవల పాలసముద్రంలో చెప్పారు. ఇలా మతం మారిన థామస్ కు రిజర్వేషన్ వర్తించదని సామాజిక కార్యకర్త ఎం ఎస్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం పెనుమూరు మండలం గొడుగుమానుపల్లెలో జరిగిన టిడిపిసదస్సులో సాక్షి విలేకరి లేచి ఆయన క్రైస్తవ మతం తీసుకున్న విషయం గూర్చిప్రశ్నించారు. దీనితో భయపడిన థామస్ జవాబు చెప్పకుండా మైక్ అపు చేసి  కూర్చున్నారు. మాజీ మంత్రి అమరనాద రెడ్డి థామస్ ను జవాబు చెప్పకుండా కూర్చో పెట్టారు. తరువాత వివరణ ఇవ్వడం మాని సాక్షిని విమర్శించారు. ఇదిలా ఉండగా ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి వర్గం ఆయన మతం మారిన రికార్డులు సేకరించి భద్రం చేసుకునే పనిలో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆ రికార్డులు సమర్పించి ఆయన నామినేషన్ చెల్లకుండా చేయాలని చూస్తున్నారు.

నేర చరిత్రపై ప్రత్యర్థుల ఆరా
గతంలో థామస్ తమ ఆసుపత్రిలో పనిచేసి మానేసిన డాక్టర్ ఎస్ రమ్యపై ఆయన 2017లో హత్యా ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయనతో సహా మరో ఐదుగురు అరెస్టు అరెస్టు అయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ కేసు వివరాలు సేకరించడానికి వైసిపి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. 2017లో మహిళా వైద్యురాలు ఎస్. రమ్యపై  హత్యాయత్నానికి పాల్పడ్డారనే ఆరోపణలపై  డాక్టర్‌ థామస్ తో పాటు మరో ఐదుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఒక రోజు రాత్రి 10 గంటల సమయంలో పెరంబూర్‌లోని పటేల్ రోడ్డులోని ఆమె అపార్ట్‌మెంట్ వెలుపల బురఖా ధరించి వచ్చిన ఓ వ్యక్తి రమ్యపై కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు విన్న కుటుంబ సభ్యులు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. బాధితురాలితో విచారణ ప్రారంభించిన సెంబియం పోలీసులు, ఆ మహిళా డాక్టర్‌కు చెన్నై ఫెర్టిలిటీ సెంటర్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వీఎం థామస్‌  నుంచి బెదిరింపు కాల్స్‌ రావడం మినహా ఆమెకు ఎలాంటి శత్రుత్వం లేదని గుర్తించారు. రమ్య మూడేళ్లుగా నెల్సన్ మాణికం రోడ్‌లోని డాక్టర్ థామస్ హాస్పిటల్‌లో ఉద్యోగం చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.  రమ్య తన ఉద్యోగానికి రాజీనామా చేసి, అరుంబాక్కమ్‌ లోని జై నగర్‌లో ఉన్న మరొక ఫెర్టిలిటీ క్లినిక్‌లో భాగస్వామిగా చేరారు.  తన సెంటర్ నుండి ఆమె పనిచేస్తున్న ఆసుపత్రికి రోగులను తీసుకుని వెళుతున్నారని థామస్‌ అనుమానించారు.  అతను ఆమెకు చాలాసార్లు కాల్స్ చేశాడు, మొదట అభ్యర్థించాడు, తర్వాత మళ్లీ తన సెంటర్‌లో చేరాలని డిమాండ్ చేశాడు, దానికి ఆమె నిరాకరించింది. థామస్  తన మేనేజర్ యోనా సహాయంతో గూండాలను నియమించుకుని ఆమెను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో దాడి చేసాడని అప్పటిలో పోలీసు అధికారి తెలిపారు. సెంబియం పోలీసులు  థామస్,యోనా,  ముగిలన్, సత్యకళ,  పళనిసామిని మరొకరిని అరెస్టు చేశారు. తరువాత కేసు ఏమయ్యిందో అన్న విషయం పై ఆరా తీస్తున్నారు. 

అలాగే ఆయనపై ఇంకేమైనా కేసులు ఉన్నాయేమో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇదిలా ఉండగా పొత్తులో భాగంగా ఈ స్థానంలో  పోటీ చేయాలని జనసేన ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ ప్రయత్నం చేస్తున్నారు. కొందరు టిడిపి నేతలు కూడా అందుకు సహకారం అందిస్తున్నారని తెలిసింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *