SEB అడిషనల్ ఎస్.పి.గా సుబ్బరాజు
చిత్తూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (SEB) అదనపు ఎస్.పి.గా భాద్యతలు ఏ. వి. సుబ్బరాజు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు జిల్లాలో 4 వ అడిషనల్ ఎస్.పి, SEB గా మిట్టూరులోని ఎక్సైజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎక్సైజ్ అధికారులు మర్యాద పూర్వకంగా కలిసారు.
విజయనగరం జిల్లాకు చెందిన ఏ.వి. సుబ్బరాజు గారు 1989 బ్యాచ్ లో ఎస్సైగా పోలీసుశాఖలో చేరారు. ఎస్ఐ గా పలుచోట్ల పనిచేసిన అనంతరం 2001 లో సిఐ గా పదోన్నతి పొందారు. శ్రీకాకుళం జిల్లాలో 7 సం. విధులు నిర్వహించి 2010 లో డిఎస్పీ గా విజయనగరం సి.ఐ.డి., ఎస్.బి., ఇంటలిజెన్స్, విశాఖపట్నం లో ఏ.సి.బి., పోలీస్ ట్రైనింగ్ సెంటర్ విజయనగరంలో పని చేశారు. 2020లో అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది మొదటగా ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా, తరువాత వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో అడ్మిన్ గా పని చేశారు. సాదారణ బదిలిలో బాగంగా చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ SEB గా ఈరోజు బాధ్యతలు చేపట్టారు.