బలిజలను అణగదొక్కితే ఖబడ్దార్
జగన్ కు చిత్తూరు బలిజ సంఘం నాయకుల హెచ్చరిక
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒక్క బలిజ నాయకుడికి కూడా ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా వైసిపి మోసం చేసిందని చిత్తూర్ బలిజ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో బలిజ సంఘం జిల్లా అధ్యక్షుడు రామదాసు, బలిజ సంఘం నేతలు తులసీరామ్, చందు కుమార్, బాలాజీ, రామ్మూర్తి, రవి, రెడ్డప్ప, కిషోర్, పెద్ద సంఖ్యలో బలిజ సంఘం నేతలు పాల్గొన్నారు.
చిత్తూరు, దర్శి ( Prakasham District ) నియోజకవర్గాల్లో బలిజ ఎమ్మెల్యేలను మార్చి రెడ్లకు YCP సీట్లు కట్టబెట్టారని విమర్శించారు. రాయలసీమలో 50 లక్షల మంది బలిజలు ఒకటిగా నిలిచి ఈసారి వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. పది జిల్లాల్లో ఒకరికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
బలిజలకు రిజర్వేషన్ ఇవ్వకపోయినా "మౌనo "గా భరించామని చెప్పారు. బలిజలను అవమానించే విధంగా వైసీపీ పార్టీ వ్యవహరించడం సమంజసం కాదని విమర్శించారు. చిత్తూరు ఎమ్మెల్యేకి రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పి " నమ్మించి మోసం " చేశారని పేర్కొన్నారు. ఈ విధంగా బలిజలను అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చిత్తూరులో కాపు భవన్ ను కూడా కాపాడుకోలేని దుస్థితి బలిజలదని ఆవేదన వ్యక్తం చేశారు. బలిజలందరూ సంఘీభావంగా ఉండి మా ప్రాబల్యాన్ని Elections -2024 చూపిస్తామని స్పష్టం చేశారు .