13, ఫిబ్రవరి 2024, మంగళవారం

శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థిగా SCV నాయుడు ?




శ్రీకాళహస్తి టిడిపి టికెట్టు రేసులో అనూహ్యంగా శాఖమూరి చెంచు వెంకట సుబ్రమణ్యం నాయుడు ( ఎస్సీవీ నాయుడు) పేరు తెర మీదకు వచ్చింది. నియోజకవర్గంలో జరుగుతున్న వరస సంఘటనలు నాయుడుకు అనుకూలంగా మారుతున్నట్లు సమాచారం. పంచాయతీ ఉప ఎన్నికల నటి నుండి చంద్రబాబు అరెస్టు విషయంలో జరిగిన అందోళన కార్యక్రమాలలో సుధీర్ వ్యవహరించిన తీరు మీద పలువురు అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. సుధీర్  వ్యవహార శైలి గురించి పలుమార్లు చంద్రబాబు కూడా హెచ్చరించారు. అయినా, అయన తీరు మారలేదని అంటున్నారు.


 ఇటేవల నిర్వహించిన ఐవిఆర్ఎస్ సర్వేలో సుధీర్ కు చాలా తక్కువ మంది అనుకూలంగా ఉన్నట్లు తెలిసింది. అలాగే సుధీర్ తల్లి బృందమ్మ, భార్య రుషితా రెడ్డి పేర్లతో కూడా సర్వే జరిగింది. ఈ సర్వేలతో అధిష్టానం ప్రత్యామ్యాయ మార్గాలపై దృష్టిని సారించినట్లు తెలిసింది. దీంతో మళ్ళి SCV నాయుడు పేరు తెర మీదకు వచ్చిందని చెపుతున్నారు. ఆయనకు మాజీ MLA మునిరామయ్య కూడా మద్దతు ఇస్తున్నారు. అయన మూడు, నాలుగు నియోజకవర్గాలను ప్రభావితం చేయగాలని అధిష్టానం దృష్టికి వెళ్ళింది. రాబిన్ శర్మ సర్వేలో కూడా సుధీర్ కు అనుకూలంగా లేదని తెలిసింది. నాయుడుకు బలమైన వర్గం ఉంది. నియోజకవర్గంలో అనుచరులు ఉన్నారు. వ్యతిరేకత లేదు. ఈ విషయాలను పరిశిలేస్తే, SCV నాయుడుకు టిక్కెట్టు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.



1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన వెంటనే ఎస్సీవీ నాయుడు పార్టీలో చేరారు. అప్పటికే విద్యార్థి, యువజన నాయకుడుగా పేరున్న ఆయన ఎన్టీఆర్ ను శ్రీకాళహస్తి పిలిపించి ఊరేగింపు చేశారు. అయితే టీడీపీలో తగిన గుర్తింపు లేక పోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిపై విజయం సాధించారు. 2009 లో ఆయన చేతిలో ఓడి పోయారు. తరువాత తిరిగి టిడిపిలో చేరారు. 2014 ఎన్నికల్లో గోపాలకృష్ణా రెడ్డికి టికెట్టు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్ధి విజయానికి కృషి చేశారు. ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీలో కొనసాగారు.

గోపాలకృష్ణా రెడ్డి మరణించిన తరువాత  2019లో జరిగిన ఎన్నకల్లో టికెట్టు ఆశించారు. అయితే గోపాల కృష్ణా రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి టికెట్టు ఇవ్వడంతో వైసీపీలో చేరి బియ్యం మధుసూదన రెడ్డి గెలుపుకు తోడ్పడ్డారు. అయితే జగన్ మోహన్ రెడ్డి తీరు నచ్చక ఆరు మాసాలు క్రితం టిడిపిలో చేరారు. పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారు. శ్రీకాళహస్తితో సత్యవేడు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజక వర్గాలలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. అయితే శ్రీకాళహస్తి ఇంచార్జి సుధీర్ రెడ్డి పనితీరు బాగలేక పోవడంతో ఎస్సీవీ పేరు తెరమీదకు వచ్చింది. సుధీర్ ను పలు సార్లు చంద్రబాబు మందలించారు. అయినా ఆయన మెరుగు పరచుకో లేదు. ఐ వీ ఆర్ ఎస్ లో ఆయనకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీనితో ఆయన తల్లి బృందమ్మ, భార్య రిషితా రెడ్డి పేర్లతో ఐ వీ ఆర్ ఎస్ సర్వే చేశారు. వారికి ప్రతికూల ఫలితాలు రావడంతో ప్రత్యామ్నాయ అభ్యర్ధిగా ఎస్సీవీ నాయుడు పేరు పరిశీలిస్తున్నారు.


 ఆయన అయితే వైసిపి అభ్యర్ధిపై గెలుపు సులభమని సర్వేలలో వెల్లడి అయినట్టు తెలిసింది. దీనితో చంద్రబాబు ఎస్సీవీ పట్ల సానుకూలంగా ఉన్నారని తెలిసింది. ఆయనకు శ్రీకాళహస్తి టికెట్టు ఇస్తే పక్క నియోజక వర్గాలలో కూల ఉపయోగం ఉంటుంది. దీనితో ఆయనకు టికెట్టు ఖాయం అంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *