18, ఫిబ్రవరి 2024, ఆదివారం

కార్మిక చట్టాలను కాపాడుకోవాలి: గంగరాజు

సిఐటియు జిల్లా అధ్యక్షుడు  వాడ గంగరాజు పిలుపు


 కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల అనుకూలమైన చట్టాలను రద్దు చేసి యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు కోడ్ లు తీసుకురావడం దుర్మార్గమని కార్మిక వర్గం ఐక్యమై కార్మిక చట్టాలను కాపాడుకోవాలని ఆదివారం పుత్తూరులోని ఉపాధ్యాయుల విశ్రాంతి ఫంక్షన్ హాల్ లో రెండవ రోజు అంగన్వాడిల శిక్షణ తరగతుల్లో  సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు పిలుపు పినిచ్చారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మతోన్మాద బీజేపీ ప్రభుత్వం కార్మికుల కులాలను మతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నదని వాటిని పసిగట్టి కార్మికుల ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్  లు తీసుకువచ్చిందని అలాగే రైతులకు మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తున్నదని విద్యుత్ సంస్కరణలు తెచ్చి భారీ స్థాయిలో విద్యుత్ ఛార్జీలు పెంచింన్నారు.ఇలాంటి విధానాలను మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ కార్మికులపై దాడి చేస్తున్నదని తెలిపారు.


 కార్మికులు విధానాలపై పోరాటాలు చేస్తున్న కార్మిక లపై నిర్బంధాలకు గురిచేసి భయభ్రాంతులను చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని అంగన్వాడీ 42 రోజులు సమ్మె చేసి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారని గుర్తు చేశారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వస్తున్న కార్మికుల వ్యతిరేక విధానాలను కార్మిక వర్గం కొట్టాలని పిలుపునిచ్చారు పోరాటం భవిష్యత్ తరాలకు ఆదర్శవంతమైన పోరాటం నిలిచిందని తెలిపారు. ఆ పోరాట సందర్భంగా సాధించిన వాటిని ప్రభుత్వం వెంటనే జీవోలు రూపంలో ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. కార్మికులందరూ ఐక్యంగా కార్మికుల పక్షాణ నిలబడే సిఐటియుని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కొంతమంది సిడిపిఓలు సూపర్వైజర్లు ఇష్టారాజ్యంగా అంగన్వాడీలపై బెదిరింపులు పాల్పడుతున్నారని మానుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ శిక్షణ తరగతుల్లో సిఐటియు నాయకులు వెంకటేష్, అంగన్వాడీ యూనియన్ నాయకులు లక్ష్మీ నరసమ్మ, ధనకోటి మమత తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *